అఖిల‌ప్రియ భ‌ర్త‌కు వ‌రుస షాక్ లు

0

ఏపీలో టీడీపీ నేత‌లు వ‌రుస‌గా ఇక్క‌ట్లలో ప‌డుతున్నారు. అయితే ఆళ్ల‌గ‌డ్డ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌ వ‌రుసగా ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌డం లేదు. అయితే ఈసారి నేరుగా ఆమె కాకుండా ఆమె భ‌ర్త‌కు షాకులిస్తున్నారు పోలీసులు. నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో మూడు కేసులు న‌మోదు కావ‌డంతో అఖిల‌ప్రియ భ‌ర్త ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది.

ఆళ్ల‌గ‌డ్డ‌లో ఓ వ్యాపార వివాదంలో భాగ‌స్వామిని బెదిరించారంటూ తొలుత అఖిల‌ప్రియ భ‌ర్త భార్గ‌వ రామ్ పై కేసు న‌మోద‌య్యింది. ఆ కేసు విచార‌ణ‌లో భాగంగా హైద‌రాబాద్ వెళ్లిన పోలీసుల‌పై దౌర్జ‌న్యం చేశారంటూ తాజాగా మ‌రో కేసు గ‌చ్చిబౌలీలో న‌మోద‌య్యింది.

ఈసారి ఏకంగా ఐపీసీ సెక్షన్‌ 353, 336 కింద అఖిలప్రియ భర్తపై కేసు నమోదు చేయ‌డంతో స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని భావిస్తున్నారు. ఆళ్లగడ్డ రూరల్‌ ఎస్‌ఐ ఫిర్యాదుతో ఈ కేసు న‌మోద‌య్యింది.. రెండు కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న భార్గవరామ్‌ను పట్టుకునేందుకు ఆళ్లగడ్డ ఎస్‌ఐ గచ్చిబౌలి వచ్చారు. ఈ సమయంలో గచ్చిబౌలిలో భార్గవరామ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా కారుతో ఢీకొట్టబోయాడని ఎస్‌ఐ రమేష్‌ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దాంతో ఇప్పుడు అఖిల‌ప్రియ కుటుంబ చ‌ట్ట‌ప‌ర‌మైన చిక్కుల్లో ఇరుక్కుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది.

భార్గ‌వ్ రామ్ మ‌రో మాజీ మంత్రి నారాయ‌ణ‌కు స‌మీప బంధువు. మాజీ డీజీపీ నండూరి సాంబ‌శివ‌రావు కుమార్తెతో విడాకుల త‌ర్వాత అఖిల‌ప్రియ‌ను వివాహం చేసుకున్నారు. అఖిల‌ప్రియ కూడా సీఎం జ‌గ‌న్ స‌మీప బంధువుతో విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here