ఆల్ టైమ్ గ్రేట్ లిస్టులో కోహ్లీ కి చోటు

0

ఆట‌గాడిగా అరుదైన రికార్డుల‌తో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సార‌ధిగానూ సంచ‌నంగా మారుతున్నాడు. కొత్త రికార్డుల‌తో అత్యుత్త‌మ కెప్టెన్ల జాబితాలో చేరుతున్నాడు. ఇప్ప‌టికే టీమిండియా త‌రుపున అత్య‌ధిక విజ‌యాలు సాధించిన కెప్టెన్ గా ధోనీని అధిగ‌మించాడు. అంతేగాకుండా క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక విజ‌యాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.

వెస్టిండీస్ తో జ‌రిగిన రెండు టెస్టుల సిరీస్ లో కోహ్లీ సేన ఘ‌న విజ‌యం సాధించింది. రెండు టెస్టుల్లోనూ భారీ విజ‌యాలు న‌మోదు చేసింది. ఈసిరీస్ లో టీ20లు, వ‌న్డే సిరీస్ ను కైవ‌సం చేసుకున్న టీమిండియా. టెస్టుల‌లో కూడా క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో విజ‌యం ద్వారా కెప్టెన్ గా కోహ్లీ 28 విజ‌యాలు న‌మోదు చేసుకున్నాడు. త‌ద్వారా ధోనీ 27 విజ‌యాలను అధిగ‌మించాడు. గంగూలీ 21, అజారుద్దీన్ 14 టెస్టుల్లోనూ కెప్టెన్లుగా విజ‌యాలు న‌మోదు చేశారు.

ఇక ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో స‌క్సెస్ ఫుల్ కెప్టెన్ల జాబితాలో గ్రేమీ స్మిత్ (103 టెస్టుల్లో 53 విజ‌యాలు) టాప్ లో ఉన్నాడు. ఆ త‌ర్వాత రికీ పాంటింగ్ (77 టెస్టుల్లో 48 విజ‌యాలు), స్టీవ్ స్మిత్ (57 టెస్టుల్లో 41 విజ‌యాలు) సాధించారు. వారి త‌ర్వాత క్ల‌యివ్ లాయిడ్ ( 74 టెస్టుల్లో 36), అలెన్ బోర్డ‌ర్ (93 టెస్టుల్లో 32) విజ‌యాలు చొప్పున ద‌క్కించుకున్నారు. వారి త‌ర్వాత కోహ్లీ సార‌ధ్యంలోని టీమిండియా 48 టెస్టు మ్యాచుల్లో 28 విజ‌యాలు న‌మోదు చేసుకుంది

ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ లో తాజా విజ‌యం ద్వారా టీమిండియా అగ్ర‌స్థానంలోకి దూసుకెళ్లింది. 2 మ్యాచ్ ల‌లో రెండు విజ‌యాలు సాధించి 120 పాయింట్ల‌తో ముంద‌జంలో ఉంది. ఆ త‌ర్వాత న్యూజీలాండ్, శ్రీలంక చెరో విజ‌యం ద్వారా 60 పాయింట్ల‌తో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here