అదుర్స్ అనిపించుకుంటున్న ‘ర‌ణ‌స్థ‌లం’ డైరెక్ట‌ర్

0

తొలిసినిమా అయిన‌ప్ప‌టికీ త‌న స‌త్తా చాటుకున్న యువ‌ద‌ర్శ‌కుడుకి ప‌లువురి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ర‌ణ‌స్థ‌లం సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆది అర‌వాల‌కు అనేక మంది సీనియ‌ర్లు కూడా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. మొద‌టి సినిమా ద్వారానే త‌న మార్క్ చూపించ‌డం ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. పూరీ జ‌గ‌న్నాధ్ స్కూల్ నుంచి వ‌చ్చిన ఈ ద‌ర్శ‌కుడు గురువుని ఆద‌ర్శంగా తీసుకున్న‌ట్టు ర‌ణ‌స్థ‌లం సినిమా చాటుతోంది. అదే స‌మ‌యంలో త‌న ప్ర‌త్యేక‌త‌ను కూడా ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం అని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

న‌వంబ‌ర్ 29 నాడు ప‌లు సినిమాల మ‌ధ్య‌లో ఆది త‌న తొలిసినిమా విడుద‌ల చేయ‌డం విశేషం. అయిన‌ప్ప‌టికీ విభిన్న చిత్రాల‌ను ఆద‌రించే టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా సంతృప్తిక‌రంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్రేక్ష‌కుల‌కు చిర‌ప‌రిచితుల‌యిన పెద్ద న‌టులు లేక‌పోయిన‌ప్ప‌టికీ కేవ‌లం చిత్రం శ్రీను, స‌త్యం రాజేష్, జ‌బ‌ర్ధ‌స్త్ అప్పారావు, షాలూ, చ‌త్ర‌ప‌తి శేఖ‌ర్ వంటి న‌టీన‌టుల‌తో సినిమాను చిత్రీక‌రించిన తీరు ప‌ట్ల ద‌ర్శ‌కుడిని ప్రేక్ష‌కులు మెచ్చుకుంటున్నారు.

విభిన్న‌మైన క‌థాంశం ఆధారంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న ఈ సినిమాకు విమ‌ర్శ‌కులు కూడా మంచి మార్కులు వేస్తున్నారు. క్రిటిక్స్ నుంచి మంచి మార్కులు వేయించుకున్న ఆది అర‌వాల త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్ ద్వారాన‌యినా గుర్తింపు ఉన్న న‌టీన‌టుల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తే ఖ‌చ్చితంగా స‌క్సెస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయ‌ని చెప్ప‌డం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here