అమిత్ షా కొడుకు ఆదాయం చూస్తే నోరెళ్ల‌బెడ‌తారు..!

0

దేశ‌మంతా ఆర్థిక‌మాంధ్యం. నిరుద్యోగం పెరుగుతోంది. చివ‌ర‌కు రిల‌యెన్స్ ముఖేష్ అంబానీ లాంటి వాళ్లు కూడా తాత్కాలికంగా కొన్నాళ్ల పాటు స్త‌బ్ద‌త త‌ప్ప‌ద‌ని అంగీక‌రించాల్సిన ప‌రిస్థితి. ఇలాంటి స‌మ‌యంలో కూడా ఒక్క‌డు మాత్రం త‌న కంపెనీల ఆదాయం అమాంతంగా పెంచుకుంటున్నారు. ఆయ‌న కంపెనీల లెక్క‌లు చూస్తుంటే ఆశ్చ‌ర్య‌పోయే స్థాయిలో ఉంటున్నాయి. ఆయ‌నే ప్ర‌స్తుతం దేశంలో నెంబ‌ర్ టూ గా ఉన్న అమిత్ షా గారాల పుత్రుడు జే షా.

జే షా ఇటీవ‌లే బీసీసీలో కీల‌క ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. బీసీసీఐలో చ‌క్రం తిప్పే సెక్ర‌ట‌రీ పోస్టులో ఆయ‌న పీఠం అధిరోహించారు. తాజాగా ఆయ‌న కంపెనీ ఆస్తుల వివ‌రాల‌ను కేంద్ర కార్పోరేట్ వ్య‌వ‌హారాల శాఖ వెబ్ సైట్ లో పొందుప‌రిచింది. వాటి వివ‌రాలు చూస్తుంటే అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కుసుమ్ ఫిన్ స‌ర్వ్ లో జే షా డైరెక్ట‌ర్ గా ఉన్నారు. వాస్త‌వానికి ఆయ‌న ప్రారంభ భాగ‌స్వామిగా రికార్డుల్లో పేర్కొన్నారు.

ఆ కంపెనీ ఆదాయం లెక్క‌ల్లో అమాంతం పెరుగుద‌ల ఏ స్థాయిలో ఉందంటే 2014 నుంచి 2019 వ‌ర‌కూ ఐదేళ్ల‌లో ఏకంగా 125 శాతం పెరుగుద‌ల న‌మోద‌య్యింది. కింద ప‌ట్టిక‌లో స్ప‌ష్టంగా గ‌మ‌నించ‌వ‌చ్చు. 2014 నాటికి కేవ‌లం 80ల‌క్ష‌ల లోపు లావాదేవీలు న‌డిపిన జే షా సంస్థ ఇప్పుడు 120 కోట్లను దాట‌డం గ‌మ‌నార్హం. బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ పెరుగుద‌ల ఆశ్చ‌ర్య‌మే కాకుండా అంత‌కుముందు త‌న త‌న‌యుడు కంపెనీలో పెట్టుబ‌డుల కోసం 25 కోట్ల రూపాయ‌ల‌కు త‌న ఆస్తిని అమిత్ షా తాక‌ట్టు పెట్టిన‌ట్టు ఆదాయ‌ప‌న్నుల శాఖ‌కి స‌మ‌ర్పించిన ప‌త్రాల్లో పేర్కొన్నారు. అంటే త‌నకు సంబంధించిన రెండు ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్టి కొడుకుతో వ్యాపారం ప్రారంభిస్తే ఇప్పుడు అమాతంగా 125 శాతం పెరుగుద‌ల స‌ద‌రు కంపెనీలో క‌నిపిస్తుండ‌డంతో జూనియ‌ర్ షా ఆస్తుల్లో కూడా ఈ పెరుగుద‌ల ప్ర‌స్ఫుటంగా క‌నిపిస్తోంది. అంతేగాకుండా 2016 త‌ర్వాత కంపెనీ ఆస్తులు కూడా వేగంగా పెరుగుతున్న విష‌యాన్ని ప్ర‌భుత్వ ప‌త్రాల్లోనే ప్ర‌స్ఫుటం అవుతోంది.

దేశంలో అవినీతిని అరిక‌ట్ట‌డం, న‌ల్ల‌ధ‌నం ప్ర‌జ‌ల‌కు పంచ‌డ‌మే త‌మ ల‌క్ష్యంగా ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ పెద్ద‌లు చెప్పిన మాట‌ల‌కు, ఇప్పుడు అమిత్ షా త‌న‌యుడి ఆదాయంలో క‌నిపిస్తున్న పెరుగుద‌ల‌కు పొంత‌న క‌నిపించ‌క‌పోవ‌డం విశేషం. అయిన‌ప్ప‌ట‌కీ తాము స‌శ్చీలుర‌మ‌ని క‌మ‌ల‌ద‌ళం అనేక మందిని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేయ‌డానికి వెన‌కాడ‌క‌పోవ‌డం మ‌రో గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here