అయ్యో..జగన్ కి ఎవరూ దొరకలేదా?

0

విపక్షంలో ఉన్నంత కాలం చంద్రబాబు సర్కారు వైపల్యాలను ఎండగట్టడంలో ముందున్న వై ఎస్ జగన్ ఇప్పుడు తాను అధికారంలో ఉండగా అదే తీరులో సాగుతున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు పద్ధతిని ఫాలో అవుతున్నట్టు పలువురు భావిస్తున్నారు. ముఖ్యంగా నియామకాల విషయంలో కొందరికి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో చివరకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భిన్నంగా సాగుతున్నారా అన్న సందేహం కలుగుతోంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖలో దేవులపల్లి అమర్ కి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఐజేయూలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. జర్నలిస్టు సంఘాలు నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అందుకు అనుగుణంగానే సాక్షి టీవీ చానెల్ లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

తెలంగాణా రాష్ట్రానికి చెందిన దేవులపల్లి అమర్ ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బాధ్యతలు అప్పగించడం వివాదానికి ఆజ్యం పోస్తోంది. అనేక మంది నుంచి విమర్శలకు తావిస్తోంది. పైగా రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక తెలంగాణా వాదిగా ఉన్న అమర్ ని పిలిచి మరీ పెద్ద పీట వేసిన తీరు అనేక మందికి మింగుడుపడడం లేదు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన అనేక మంది సీనియర్ జర్నలిస్టులు, అనుభవజ్నులు ఉన్నప్పటికీ అమర్ కి మాత్రం జాతీయ మీడియా. అంతర్రాష్ట్ర మీడియా సమన్వయం చేసే బాధ్యత అప్పగించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు

గతంలో చంద్రబాబు హయంలో ఇలాంటి నియామకాల సందర్భంగా తెలంగాణాకి చెందిన వారికి బాధ్యతలు అప్పగించడాన్ని వైసీపీ విమర్శించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవమానంగా పేర్కొంది. అలాంటిదిప్పుడు తాము అధికారంలో ఉండగా ఏకంగా తెలంగాణాకే పరిమితం అయిన ఓ జర్నలిస్టుకి ప్రధాన పోస్టు కేటాయించడం విస్మయం కలిగిస్తోంది. సాక్షి మీడియా సంస్థల సిబ్బంది ఖమ్మం జిల్లాకు చెందిన జీవీడీ సహా పలువురిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించిన జగన్ తాజాగా తెలంగాణా నుంచి అమర్ ని కూడా తీసుకురావడం మీడియా వర్గాల్లోనూ అసంత్రుప్తికి కారణం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here