అయ్యో..జ‌గ‌న్ అలా ఎందుకు?

0

అవ‌కాశాలు అంద‌రికీ, అన్ని సార్లు రావు. ఆ విష‌యం అంద‌రిక‌న్నా జ‌గ‌న్ కి బాగా తెలుసు. తృటిలో అధికారం కోల్పోయి 2014 నుంచి ఐదేళ్ల పాటు ఎదురుచూడాల్సిన వచ్చిన అనుభ‌వం ఆయ‌న‌ది. మొన్న‌టి ఎన్నిక‌ల్లో చ‌రిత్ర సృష్టించి పీఠం మీద నిలిచిన నేప‌థ్యం కూడా జ‌గ‌న్ కి ఉంది.

కానీ గ‌డిచిన నాలుగేళ్లుగా జ‌గ‌న్ పాల‌న‌లో జ‌నం సంతృప్తిగా క‌నిపించ‌డం లేదు. దానికి అనేక అంశాలు తోడ‌వుతున్నా జ‌గ‌న్ కూడా పూర్తిగా ప్ర‌జాభిప్రాయానికి ప్రాధాన్య‌త‌నివ్వ‌క‌పోవ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు ఇసుక స‌మ‌స్య తీవ్ర‌త‌కు ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. నేటికీ ఇసుక కొర‌త‌, అధిక ధ‌ర‌లు అనేక మందిని స‌త‌మ‌తం చేస్తున్నాయి.

ఇక అన్న క్యాంటీన్ల మూత‌, పోల‌వ‌రం, అమ‌రావ‌తి ప‌నుల నిలిపివేత కూడా ప‌లు సందేహాల‌కు తావిస్తోంది. ఇక కేసీఆర్ ని ప‌దే ప‌దే క‌లిసి రావ‌డం కూడా ఆయ‌నకు తోక‌గా మారార‌నే అభిప్రాయాన్ని క‌లిగిస్తోంది. తాజాగా ఉద్యోగ నియామ‌కాల ద్వారా రావాల్సిన మైలేజీని మీడియా కార‌ణంగా అపోజిష‌న్ హైజాక్ చేస్తున్నా అడ్డుకోలేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. స‌ర‌యిన కౌంట‌ర్ ఇవ్వ‌గ‌లిగిన క్యాబినెట్ స‌హ‌చ‌రులు కూడా లేక‌పోవ‌డం పెద్ద బ‌ల‌హీన‌త‌గా మారింది.

క‌రెంటు కోత‌లు, రైతు భ‌రోసాలో పెట్టిన కులం కోటాలు కూడా క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇంత జ‌రుగుతున్నా ముఖ్య‌మంత్రి హోదాలో నోరు విప్ప‌క‌పోవ‌డం మ‌రో విశేషంగా మారుతోంది. స‌ర్కారుని డిఫెన్స్ లోకి నెడుతోంది. నాలుగు నెల‌ల ప్ర‌భుత్వం మీద గ‌తంలో ఎన్న‌డూ లేనంత అసంతృప్తి ఇప్పుడు ఆయ‌న‌కు ఓటేసిన వారిలో కూడా క‌నిపించ‌డం ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామంగా చెప్ప‌వ‌చ్చు. దాంతో దాదాపుగా ఉనికి కోల్పోతుంద‌ని భావించిన టీడీపీకి మ‌రోసారి ఊపిరి పోస్తున్న‌ట్టుగా కొంద‌రు భావిస్తున్నారు. జ‌గ‌న్ పుణ్య‌మా అని చంద్ర‌బాబు కి ఛాన్స్ ద‌క్కుతోంద‌నే అభిప్రాయానికి కొంద‌రు వ‌స్తున్నారు. అంది వ‌చ్చిన అవ‌కాశం కూడా చేజార్చుకుంటున్న తీరుతో వైసీపీ శ్రేణులు కూడా కొంత క‌ల‌వ‌ర‌ప‌డ‌తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here