యలమంచలి బాబూ రాజేంద్రప్రసాద్. గత కొన్నేళ్లుగా తెలుగు మీడియా చానెళ్ల ద్వారా రాష్ట్రంలో చాలామందికి చిరపరిచుతుడు. టీవీ స్టూడియోల నుంచి వైరి పక్షాలపై విరుచుకుపడడంలో ఆయన సిద్ధహస్తుడిగా పేరుంది. ముఖ్యంగా జగన్ మీద బాబూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు అన్నీ పలుమార్లు హాట్ టాపిక్ అయ్యాయి.
అలాంటి రాజేంద్రప్రసాద్ కి తొలిసారిగా చుక్కలు కనిపించాయి. ముఖ్యంగా నిన్నటి వరకూ తన స్నేహితుడిగా ఉన్న వల్లభనేని వంశీ రూపంలో వైబీఆర్ కి షాక్ తగిలింది. టీవీ9 చర్చల్లో వంశీ చేసిన కామెంట్స్ కి రాజేంద్రప్రసాద్ బిక్కచచ్చిపోవాల్సినంత పని అయ్యింది. పెనమలూరు సీటు కోసం బోడే ప్రసాద్ దగ్గర తీసుకున్న డబ్బు నుంచి సొంత కూతురు పెళ్లి కోసం చేసిన వసూళ్ల వరకూ ప్రస్తావించడం ద్వారా వంశీ విమర్శల జడివాన కురిపించాడు. దాంతో పాటుగా అనేక బాంబులు పేల్చి పెద్ద హాట్ టాపిక్ అయ్యారు. ఆ క్రమంలోనే కొన్ని అభ్యంతకర పదాలు ప్రయోగించిన వంశీ తీరు పట్ల మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
వంశీ ఎలా ఉన్నప్పటికీ ఈ పరిణామం రాజేంద్ర ప్రసాద్ ఎటూ పాలుపోని స్థితికి నెట్టింది. ఏం చెప్పాలో, ఏం చేయాలో తెలియనంత సందిగ్ధం ఆయనకు ఎదురయ్యింది. చివరకు సొంత పార్టీ నేతలు ఎవరూ ఆయనకు అండగా నిలవలేని పరిస్థితి వచ్చింది. ఎవరు వంశీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారి వ్యవహారాలు ముందుకు వస్తాయోననే ఆందోళనతో మిగిలిన నేతలున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాబూ రాజేంద్రప్రసాద్ కి మద్ధతుగా టీడీపీ నేతలెవరూ మాట్లాడేందుకు సిద్ధం కాలేదు. ఈ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాజేంద్రప్రసాద్ సొంత పార్టీ మీద అలకబూనినట్టు ప్రచారం సాగుతోంది. ఒంటికన్ను, ముండ, చెత్తనాకొడకా, నోర్మూయ్, లోఫర్, జోకర్ అంటూ రకరకాల భాషలో కించపరిచినా స్పందించకపోవడంతో ఆయన చిన్నబుచ్చుకున్నారనే చెబుతున్నారు. తనకు కనీస మద్ధతు కూడా దక్కలేదని వాపోతున్నట్టు చెబుతున్నారు. ఏమయినా ఈ పరిణామాలు టీడీపీలో కొత్త సమస్యకు దారితీయకుండా ఉటాయా లేదా అన్నది చూడాలి.