అల్లు అర్జున్ ని గట్టెక్కిస్తుందా?

0

సినిమా రంగంలో ఉన్న వారికి సెంటిమెంట్లు సర్వ సాధారణమే. ఇప్పుడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అలాంటి సెంటిమెంట్ ఒకటి ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే నా పేరు సూర్య అంటూ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన బన్నీ, ఎలా అయినా హిట్ కొట్టాలనే పట్టుదలతో ప్రయత్నిస్తూ త్రివిక్రమ్ తో జతగట్టాడు. ఈ హిట్ ఫెయిర్ మళ్లీ అలాంటి సక్సెస్ కొడుతుందనే అంచనా అభిమానుల్లో ఉంది.

అల్లు అర్జున్‌ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో మువీకి సంబంధించిన టైటిల్, టీజర్ ని స్వతంత్య్ర దినోత్సవం నాడు రిలీజ్ చేశారు. సినిమాకు ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. టీజర్‌లో అల్లు అర్జున్‌, మురళీశర్మ మధ్య సాగే సన్నివేశాన్ని చూపించారు. అందులో బన్ని మధ్య తరగతి యువకుడిలా కనిపించాడు. ‘ఏంట్రోయ్‌.. గ్యాప్‌ ఇచ్చావు?’ అని మురళీ శర్మ ప్రశ్నిస్తే.. ‘ఇవ్వలా.. వచ్చింది’ అని బన్నీ వెటకారంగా సమాధానం ఇచ్చాడు.  

ఇక టైటిల్ విషయంలో త్రివిక్రమ్ తన బాణీలో సాగినట్టు కనిపిస్తోంది. గతంలో ఆయన సినిమాలకు పాటించిన పద్ధతినే అవలంభించాడు. అ అక్షరం తనకు సెంటిమెంట్ గా భావించే త్రివిక్రమ్ ఈసారి కూడా ఫాలో కావడం విశేషం. అల్లు అర్జున్‌ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని హారిక, హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. పూజ హెగ్డే కథానాయిక. టబు, రాజేంద్రప్రసాద్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here