ఆర్ఎస్ఎస్ ప్ర‌చారం అస‌త్య‌మ‌ని తేలింది…!

0

దేశంలో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో చిన్న చిన్న అంశాలు కూడా తీవ్ర స్థాయిలో ఉద్రిక్త‌త‌లు రాజేసే ప్ర‌మాదం ఉంటుంది. ముఖ్యంగా మ‌తం వంటి సున్నిత అంశాల విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.అ యినా బెంగాల్ లో బ‌ల‌ప‌డాల‌ని రాజ‌కీయంగా త‌హ‌త‌హ‌లాడుతున్న బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ ఓ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని దేశ‌మంతా ప్ర‌చారం చేసింది. చివ‌ర‌కు ఆర్ఎస్ఎస్ చెబుతున్న దానిలో వాస్త‌వం లేద‌ని బ‌య‌ట‌ప‌డింది.

బెంగాల్ లో ఓ కుటుంబం హ‌త్య క‌ల‌క‌లం రేపింది. మృతుడు ఉపాధ్యాయుడు కావ‌డం, గ‌ర్భంతో ఉన్న అతని భార్య‌, చిన్నారి కొడుకుని కూడా క‌త్తుల‌తో నరికి చంప‌డం విషాదం నింపింది. ఈ ఘ‌ట‌న ద్వారా రాజకీయ ల‌బ్ది పొందాల‌ని ఆశించిన ఆర్ఎస్ఎస్ , ఇత‌ర అనుబంధ సంఘాలు పెద్ద స్థాయిలో ప్రచారం సాగించాయి. స్కూల్‌ టీచర్‌ బంధు ప్రకాశ్‌ పాల్ ని ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త కాబ‌ట్టి హ‌త్య చేశారంటూ అనేక చోట్ల ఆందోళ‌న‌ల‌కు కూడా పూనుకుంది.

అయితే అస‌లు వాస్త‌వం దానికి భిన్నంగా ఉంద‌ని రూఢీ అయ్యింది. పోలీసుల విచార‌ణ‌లో ఈ విష‌యం స్ప‌ష్టం అయ్యింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ నేరం జరిగిందని పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న కూలీ ఉత్పల్‌ బెహరాను అరెస్టు చేశామని.. అతడు నేరం అంగీకరించాడని వెల్లడించారు. బంధు నిర్వహిస్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీంలో ఖాతాదారుడైన ఉత్పల్‌… తన డబ్బులు తనకు ఇచ్చేందుకు నిరాకరించడంతోనే బంధు కుటుంబాన్ని హతమార్చినట్లు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12.06 నుంచి 12.11 ప్రాంతంలో ఈ దారుణం జరిగిందని.. ఆ సమయంలో బంధు ఇంటి నుంచి ఉత్పల్‌ బయటికి రావడం తాను చూసినట్లు పాలు అమ్ముకునే వ్యక్తి వాంగ్మూలం ఇచ్చాడని తెలిపారు.

అంతేగాక ఉత్పల్‌ ఫోన్‌కాల్‌ లిస్టు, ఘటనాస్థలంలో దొరికిన ఆయుధంపై అతడి వేలిముద్రలు దొరికాయని పోలీసులు వెల్లడించారు. దీంతో ఉత్పల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని పేర్కొన్నారు. తొలుత బంధును మాత్రమే చంపాలనుకున్నానని.. అయితే ఆ సమయంలో అతడి భార్యా పిల్లలు తనని చూస్తే పోలీసులకు చెబుతారనే భయంతోనే వారిని కూడా హత్య చేసినట్లు ఉత్పల్‌ విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

పైగా మృతుడు బంధుకి ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేద‌ని అత‌ని త‌ల్లి స్ప‌ష్టం చేసింది. అదంతా కేవ‌లం ప్ర‌చారం మాత్ర‌మేన‌ని కొట్టివేసింది. మొత్తంగా పోలీసులు, బంధువులు చెబుతున్న స‌మాచారంతో ఆర్ఎస్ఎస్ చెబుతున్న విష‌యాల‌కు పొంత‌న‌లేక‌పోవ‌డంతో అబ‌ద్ధ‌పు ప్ర‌చారం ద్వారా ల‌బ్ధి పొందాల‌నే కుయుక్తులు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here