ఆ చానెళ్ల‌కు ఎంత క‌ష్ట‌మొచ్చిందో..!

0

ఎవ‌రైనా కింది స్థాయి సిబ్బంది వెయ్యి, రెండు వేల లంచం తీసుకుంటూ దొరికిపోతే బ్రేకింగులు అల్లాడిస్తారు. ఓ కానిస్టేబులో, మ‌రొక‌రో వందో, రెండొంద‌లకో క‌క్కుర్తి ప‌డితే ఇక మామూలుగా ఉండ‌దు. అలాంటి చానెళ్లు ఇప్పుడు ఓ బ‌డా కార్పోరేట్ సంస్థ‌పై ఐటీ దాడులు జ‌రుగుతుంటే నోరు మెద‌ప‌లేకపోతోంది. వార్త ప్ర‌జ‌ల‌కు అందించాల‌నే స్పృహ కూడా మ‌ర‌చిపోయింది. స‌మాచారం అందించ‌డానికి కూడా సిద్ధ‌ప‌డ‌లేక‌పోతోంది.

దానికి ప్ర‌ధాన కార‌ణం ఐటీ అధికారులు దాడులు చేస్తున్న‌ది మేఘా సంస్థ మీద కావ‌డం, ఆ సంస్థ‌కు టీవీ9లో భాగ‌స్వామ్యం ఉండ‌డం, టీఆర్ఎస్ కి స‌న్నిహితులు కావ‌డంతో సైలెన్స్ అల‌ముకున్న‌ట్టు అంతా భావించాల్సి వ‌స్తోంది. బ్రేకింగుల హోరింగులు, లైవ్ రిపోర్టింగులు, డిస్క‌ష‌న్లు లాంటివి కూడా లేక‌పోగా క‌నీసం స్క్రోలింగ్ కి కూడా కొన్ని చానెళ్లు సిద్ధం కాలేక‌పోతున్నాయి.

మేఘా సంస్థ‌కి మిగిలిన మీడియా సంస్థ‌ల‌తో ఉన్న అనుబంధం రీత్యా అటువైపు చూడ‌డానికి కూడా అనేక చానెళ్లు సిద్ధం కావ‌డం లేదు. రేపు వ‌చ్చే ప‌త్రిక‌ల్లో కూడా ఈ వార్త‌కు ప్రాధాన్య‌త ద‌క్కే అవ‌కాశం లేదు. మొత్తంగా ఒక‌నాటి ఎల్లో మీడియా స్థానంలో ఇప్పుడు కార్పోరేట్ మీడియా పూర్తిగా దాసోహం అవుతున్న తీరుని ఈ ఘ‌ట‌న రుజువు చేస్తోంది. మేఘా దెబ్బ‌కు మూగ‌బోయిన చానెళ్ల ప‌రిస్థితి చూసి ప‌లువురు ముక్కున వేలేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here