ఈ హీరోతో డేటింగ్ గురించి క్లారిటీ ఇచ్చిన ర‌ష్మిక‌

0

ర‌ష్మిక ప్ర‌స్తుతం టాలీవుడ్ లో గుర్తింపు సాధిస్తున్న హీరోయిన్. వ‌రుస హిట్స్ తో మంచి ఇమేజ్ సంపాదించింది. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టించి కుర్ర‌కారుని ఆక‌ట్టుకుంది. అదే స‌మ‌యంలో విజ‌య్ తో ప్రేమాయ‌ణం కూడా ప్రారంభించింద‌నే ప్ర‌చారం ఊపందుకుంది.ఏకంగా ఈ క్రేజీ హీరోతో డేటింగ్‌లో ఉన్న‌ట్టు క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. దాని వ‌ల్లే ద‌ర్శ‌కుడు రక్షిత్‌తో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుందంటూ ఈ ముద్దుగుమ్మ గురించి శాండిల్ వుడ్ లో ప్ర‌చారం చ‌క్క‌ర్లు కొడుతోంది.ర‌ష్మిక మాత్రం ఈ ప్ర‌చారాన్ని తోసిపుచ్చింది. త‌మ మధ్య అలాంటిది ఏమీ లేదని చెప్పింది. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఈ ప్ర‌చారాన్ని కొట్టిపారేశాడు. కానీ ఈ గుస‌గుస‌లు ఆగ‌లేదు. దాంతో ర‌ష్మిక కి మ‌ళ్లీ తాజాగా ఈ ఎఫైర్ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్న ఎదుర‌య్యింది. విజయ్‌తో డేటింగ్‌లో ఉన్నారా? అని రష్మికను ప్రశ్నించడంతో ఈ భామ ఖంగుతినాల్సి వ‌చ్చింది. అయినా దానికి కౌంట‌ర్ ఇస్తూ.. ఈ ప్రశ్నకు చాలా సార్లు సమాధానం చెప్పా. విజయ్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదని స్పష్టం చేసింది.

గ‌తంలో కూడా చాలామంది తొలుత ఇలానే చెప్పార‌ని, కానీ ఆ త‌ర్వాత వారి బంధం బ‌ల‌ప‌డింద‌ని కొంద‌రు వాదిస్తుంటే, అలా ఏమీ లేద‌ని మ‌రికొంద‌రు వాదిస్తున్నారు. ఏమ‌యినా ఈ యువ‌జంట మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here