ఎన్టీఆర్ విల‌న్ ని ఢీ కొడుతున్న వీవీ వినాయ‌క్

0

టాలీవుడ్ మాస్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కుతున్నాడు. హీరోగా రూపాంత‌రం చెందుతున్న వీవీ వినాయ‌క్ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో వినాయ‌క్ హీరో కాగా ‘శరభ’ ఫేమ్ ఎన్ నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. గత నెలలో అక్టోబర్ 9న వినాయక్ బర్త్ డేని పురస్కరించుకొని ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు అధికారికంగా షూటింగ్ ప్రారంభించారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది. కాగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. బ‌ల‌మైన విల‌న్ ని ఢీ కొట్టేందుకు వినాయ‌క్ రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ సీనయ్య చిత్రంలో వినాయక్ కి విలన్ గా ఓ యంగ్ హీరో దిగుతున్నాడట. ప్రస్తుతం విలన్ మరియు సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తున్న నవీన్ చంద్ర సీనయ్య చిత్రంలో విలన్ గా చేస్తున్నారని సమాచారం. గత ఏడాది విడుదలైన అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో నవీన్ చంద్ర ఎన్టీఆర్ కి విలన్ గా ప్రాధాన్యం ఉన్న రోల్ చేయడం జరిగింది. తాజాగా సూపర్ హిట్ గా నిలిచిన ఎవరు చిత్రంలో నవీన్ కీలక పాత్ర చేశారు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక సీనయ్య సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here