కాకరేపుతున్న వ‌ర్మ: త‌ల‌నొప్పి ఎందుకనుకుంటున్న పార్టీలు

0

వివాదాలు సృష్టించి, సొమ్ము చేసుకోవ‌డంలో సిద్ధ‌హ‌స్తుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఈ సంగ‌తి తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ తెలుసు. ఇటీవ‌ల ఆయ‌న సినిమాలు వ‌రుస‌గా ఫెయిల్ కావ‌డానికి అది కూడా ఓ కార‌ణ‌మే. వ‌ర్మ వ్య‌వ‌హారం క‌నిపెట్టిన ప్రేక్ష‌కులు ఆయ‌న సినిమా వైపు చూడ‌క‌పోవ‌డంతో ప‌లు సినిమాలు ఫ్లాఫుల‌వుతున్నాయి. అయినా ప‌ట్టువ‌ద‌ల‌కుండా మ‌రింత ఆస‌క్తిక‌ర అంశాల‌తో ఆయ‌న సినిమాలు రూపొందిస్తున్నారు. అందులో భాగ‌మే ఇప్పుడు వ‌స్తున్న‌ ఏపీ రాజకీయాలపై ‘ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే పోలిటికల్ సెటైరికల్ .

ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్లు కూడా విడుదల అయ్యాయి. ఆ ట్రైలర్లని బట్టి చూస్తే ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక చంద్రబాబు-లోకేశ్ పరిస్తితి ఎలా ఉందనే దానిపైనే ఫోకస్ చేసి సినిమా తెరకెక్కించినట్లు కనబడుతుంది. అలాగే అమరావతిలో జగన్ పరిపాలన మొదలయ్యాక, హత్యా రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయి. జగన్…చంద్రబాబు టార్గెట్ గా ఎలా రాజకీయాలు నడుపుతున్నారనేది చూపించారు. అదేవిధంగా ఇందులో పవన్ కల్యాణ్, కేఏ పాల్ పాత్రలు కూడా పెట్టారు.

సినిమా ట్రైలర్లని బట్టి చూస్తే పక్కా చంద్రబాబుని టార్గెట్ చేశారని అర్ధమవుతుంది. అక్కడక్కడ కొన్ని సీన్లు చూస్తుంటే సినిమాలో జగన్ ని కూడా నెగిటివ్ చేస్తారనే అనుమానం కూడా ఉంది. అయితే ఇలా డైరెక్ట్ గా పోలిటికల్ పాత్రలు అర్ధమవుతున్న టీడీపీ, వైసీపీ నేతలు ఏ మాత్రం స్పందించడం లేదు. ట్రైలర్ ఎక్కువగా చంద్రబాబు టార్గెట్ గానే ఉంది కాబట్టి వైసీపీ నేతలు చూసి ఆనందపడుతున్నారు తప్ప దానిమీద రియాక్ట్ కావడం లేదు. ఇక టీడీపీ నేతలు అంతలా చేసిన మాట్లాడటం లేదు. ఎక్కడో కొందరు కులం విషయంపై కేసులు వేయడం తప్ప వర్మని అనవసరంగా కెలకడం ఎందుకనే టీడీపీ వాళ్ళు వదిలేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్‌కు రెండు రోజుల టైం ఉండడంతో పవన్‌, బాబు అభిమానుల్లో కాక రేపుతోందన్నది మాత్రం నిజం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here