కాజ‌ల్ కి కోపం వ‌చ్చింది…!

0

టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజ‌ల్ కి కోపం వ‌చ్చింది. త‌న సినిమా సీన్లు క‌ట్ చేయ‌డంపై ఆగ్ర‌హంతో ఊగిపోయింది. ఈ చందమామ లేటెస్ట్ మువీ కి సంబంధించి సెన్సార్ బోర్డ్ తీరు మీద ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఎంతో కష్టపడి తీస్తే ఇన్ని కట్‌లు ఏంటంటూ ఆమె ఫైర్ అవుతోంది. ఇలా కత్తిరించడం నాకేం నచ్చడం లేదంటూ ఆమె అసహనం వ్యక్తం చేస్తోంది.

కాజల్ ప్రధానపాత్రలో ప్రముఖ దర్శకుడు రమేష్ అరవింద్ పారిస్ పారిస్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో విజయం సాధించిన క్వీన్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఎప్పుడో షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు కూడా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల చిత్ర దర్శక నిర్మాతలు పారిస్ పారిస్‌ను సెన్సార్‌ ముందుకు తీసుకెళ్లారు. అయితే అక్కడే టీమ్‌కు పెద్ద షాక్ తగిలింది. ఈ మూవీలో అసభ్యకర సీన్లు ఉన్నాయని చెప్పిన సెన్సార్ బోర్డు.. దాదాపు 25 సీన్లకు కత్తెర వేసింది.

ఈ ప‌రిణామాల‌పై కాజ‌ల్ త‌న కోపాన్ని వెళ్ల‌గ‌క్కింది. సెన్సార్ బోర్డ్ తీరుని త‌ప్పుబ‌డుతూ ఇలా వ్యాఖ్యానించింది.

‘‘దక్షిణాది అన్ని భాషల్లో మేము క్వీన్‌ను రీమేక్‌ చేశాం. అసలు సెన్సార్ వాళ్లు అన్ని కట్‌లు ఎందుకు చేశారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. మేము మరొకరి మనోభావాలను కించపరిచేలా సినిమా తీయలేదు. సెన్సార్ వాళ్లు ఏ సన్నివేశాలను కట్ చేయమని చెప్పారో అవన్నీ అందరి నిజ జీవితంలో జరిగేవే. ఆ సన్నివేశాలను సినిమాలో పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నేను నిర్మాతలకు చెప్పాను. ఈ సినిమా షూటింగ్ కోసం టీం మొత్తం ఎంతో కష్టపడింది. ఈ విషయంలో సెన్సార్ సభ్యులు మరోసారి ఆలోచిస్తారని భావిస్తున్నా’’ అని కాజల్ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here