కూల్చిన‌ 12గంట‌ల్లోనే మ‌ళ్లీ అంబేద్క‌ర్ విగ్ర‌హం

  0

  త‌మిళ‌నాడులో కుల ఘ‌ర్ష‌ణ‌లు అదుపు త‌ప్పాయి. ప్ర‌భుత్వ నిర్వాహ‌కం, పోలీస్ నిర్ల‌క్ష్యంతో వేద‌రాణ్యంలో కొంద‌రు అల్ల‌రి మూక‌లు రెచ్చిపోయారు. రాజ్యాంగ నిర్మాత విగ్ర‌హంపై దాడికి పాల్ప‌డ్డారు. అధిప‌త్య కులాల‌కుచెందిన కొంద‌రు యువ‌కులు వీరంగం చేస్తూ విగ్ర‌హంపై దాడికి పాల్ప‌డి, ధ్వంసం చేశారు.

  విగ్ర‌హాన్ని కూల‌గొడుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో వివాదం ముదిరింది. దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. త‌మిళనాడు ప్ర‌భుత్వం తీరుని తీవ్రంగా ఖండించారు. దాంతో చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఆల‌శ్యంగా ప్ర‌భుత్వం మేల్కొనాల్సి వ‌చ్చింది. స్థానిక పోలీసుల తీరుపై సీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేగాకుండా విగ్ర‌హాన్ని కూల్చిన స్థ‌లంలోనే మ‌ళ్లీ నూత‌న కాంశ్య విగ్ర‌హం ప్రారంభించారు.

  ఆదివారం సాయంత్రం జ‌రిగిన ఘ‌ట‌న‌లో అంబేద్క‌ర్ విగ్ర‌హం ధ్వ‌సం చేయ‌గా 12 గంట‌లు గ‌డ‌వ‌క‌ముందే సోమ‌వారం ఉద‌యం 6గం.ల ప్రాంతంలో నూత‌న విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డం విశేషంగా మారింది. దళిత యువ‌కుడు ఒక‌రు వెహిక‌ల్ విష‌యంలో త‌గాదాప‌డిన నేప‌థ్యంలో మొద‌ల‌యిన వివాదం చినికిచినిక గాలివాన‌లా మారింది.

  సేలం జిల్లా అధికారులు స్పందించ‌డంతో ప్ర‌స్తుతం వేద‌రాణ్యంలో భారీ బందోబ‌స్తు ఏర్పాటుచేశారు. ప‌ట్ట‌ణ‌మంతా 144 సెక్ష‌న్ విధించారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితి పూర్తిగా అదుపులో ఉంద‌ని జిల్లా ఎస్పీ రాధాకృష్ణ‌న్ తెలిపారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here