కొత్త చ‌రిత్ర సృష్టించిన కోహ్లీ సేన‌

0

కోహ్లీ సార‌ధ్యంలోని టీమిండియా నూత‌న అధ్యాయం ర‌చించింది. బంగ్లాదేశ్ తో జ‌రుగుతున్న సిరీస్ లో రెండో టెస్టులో సునాయాసంగా విజ‌యం సాధించింది. ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఈ మ్యాచ్ ద్వారా వ‌రుస‌గా 7 టెస్టుల‌లో విజ‌యం సాధించి న‌యా చ‌రిత్ర రాసింది. గ‌తంలో 1983, 2003లో వ‌రుస‌గా ఆరేసి టెస్టుల చొప్పున గెల‌వ‌గా, తొలిసారిగా అద్వితీయంగా ఏడు మ్యాచుల్లో గెల‌వ‌డం విశేషం.

గ‌త నెల‌లో సొంత గ‌డ్డ‌పై ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుని చిత్తు చేసిన టీమిండియా. తాజాగా బంగ్లాదేశ్ ని వ‌రుస‌గా రెండు మ్యాచుల‌లోనూ ఇన్నింగ్స్ తేడాతో ఓడించ‌డం ద్వారా వ‌రుస‌గా నాలుగు మ్యాచుల‌లో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన తొలి జ‌ట్టుగా రికార్డ్ సాధించింది.

ఇక తొలి డే అండ్ నైట్ టెస్టులో విజ‌యం న‌మోదు చేసుకుంది. 2 రెండు రోజుల 1 సెష‌న్ కూడా పూర్తికాకుండానే ముగిసిన మ్యాచులో తొలి ఇన్నింగ్స్ లో ఇషాంత్, రెండో ఇన్నింగ్స్ లో ఉమేష్ యాద‌వ్ 5 చొప్పున వికెట్లు సాధించాడు. ఈ టెస్టులో కోహ్లీ త‌న 27వ టెస్ట్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. కెప్టెన్ గా 20వ టెస్ట్ సెంచ‌రీ సాధించాడు. రికీ పాంటింగ్ రికార్డ్ కి స‌మాన‌మ‌య్యాడు. అదే స‌మ‌యంలో అతి త‌క్కువ ఇన్నింగ్స్ లో 5వేల టెస్ట్ ర‌న్స్ న‌మోదు చేసిన కెప్టెన్ గా రికార్డ్ నెల‌కొల్పాడు.

కోల్ క‌తా టెస్టులో 9 వికెట్లు సాధించిన ఇషాంత్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ తో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక‌య్యాడు. సిరీస్ లో అత్య‌ధిక ర‌న్స్ చేసిన బ్యాట్స్ మేన్ గా మాయాంక్ అగ‌ర్వాల్ నిలిచాడు. రెండు మ్యాచుల‌లో క‌లిపి 257 ర‌న్స్ సాధించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here