కోహ్లీతో రోహిత్ కొత్త స‌మ‌రం

0

టీమిండియా స్టార్ ఆట‌గాళ్ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు చాలాకాలంగా సాగుతోంది. వ‌ర‌ల్డ్ క‌ప్ సంద‌ర్భంగా ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. అప్ప‌ట్లో కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌ధ్య మ‌నస్ప‌ర్థ‌లు అంటూ మీడియా కోడై కూసింది.

ఈ వ్య‌వ‌హారం అలా ఉండ‌గానే తాజాగా టీ20ల‌లో ఇద్ద‌రి మ‌ధ్య పోరు సాగుతోంది. అత్య‌ధిక ర‌న్స్ చేసిన వారి లిస్టులో ప్లేస్ కోసం ఇద్ద‌రూ పోటీప‌డుతున్నారు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న సిరీస్ లో మొహ‌లీ మ్యాచ్ త‌ర్వాత అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లి తొలి స్థానంలో ఉండగా, రోహిత్‌ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.మొహ‌లిలో కోహ్లి రాణించడంతో రోహిత్‌ శర్మ రికార్డును సవరించాడు. మరొకవైపు అత్యధికంగా యాభైకి పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూడా కోహ్లి, రోహిత్‌లే తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. దాంతో వీరిద్దరి మధ్య పరుగుల పోటీ ఏర్పడింది. ఈ రోజు మ్యాచ్‌లో రోహిత్‌ రాణిస్తే కోహ్లి రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం ఉంది.

గత మ్యాచ్‌లో రోహిత్‌ నిరాశ పరచడంతో కచ్చితంగా ఈ మ్యాచ్‌లోనైనా ఆకట్టుకోవాలని ఉన్నాడు. అదే సమయంలో కోహ్లి కూడా ఫామ్‌ను కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి 2,441 పరుగులతో ఉండగా, రోహిత్‌ 2,434 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇక యాభైకి పరుగుల్ని కోహ్లి 22 సార్లు సాధించగా, రోహిత్‌ 21 సార్లు సాధించాడు. ఇక్కడ కోహ్లి ఖాతాలో సెంచరీలు ఏమీ ఉండకపోగా, రోహిత్‌ శర్మ ఖాతాలో నాలుగు అంతర్జాతీయ టీ20 సెంచరీలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here