కోహ్లీ డ‌కౌట్ రికార్డ్..!

0

ఇప్ప‌టికే క్రికెట్ లో ఎన్నో వ‌రల్డ్ రికార్డులు నెల‌కొల్పిన టీమిండియా సార‌ధి విరాట్ కోహ్లీ తాజాగా మ‌రో రికార్డ్ కి చేరువ‌య్యాడు. అత్యంత ప్ర‌తిభావంతుడైన క్రికెట‌ర్ గా గుర్తింపు పొందిన కోహ్లీ అత్యంత పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ల్లోనూ ముందు నిలుస్తున్నాడు. దానికి త‌గ్గ‌ట్టుగానే అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన వారి లిస్టులో ముందంజ‌లో ఉంటున్నాడు.

తాజాగా బంగ్లాదేశ్ తో స్వ‌దేశంలో జ‌రుగుతున్న సిరీస్ ఇండోర్ టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ సున్నా కే వెనుదిరిగాడు. దాంతో బంగ్లా జ‌ట్టుతో జ‌రిగిన టెస్ట్ మ్యాచుల్లో డ‌కౌట్ అయిన తొలి టీమిండియా కెప్టెన్ గా రికార్డుల‌కెక్కాడు. అంతేగాకుండా వ‌ర్త‌మాన క్రికెట్ లో టాప్ ఆట‌గాళ్లుగా ఉన్న వారి జాబితాలో అత్య‌ధిక మార్లు డ‌కౌట్ అయిన బ్యాట్స్ మెన్ గా కోహ్లీ నిలిచాడు. ఆ జాబితాలో అంత‌ర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మేట్ల‌లో క‌లిపి రోహిత్ శ‌ర్మ 20 సార్లు డ‌కౌట్ కాగా, కేన్ విల‌య‌మ్స‌న్ 16, డేవిడ్ వార్న‌ర్ 16, జో రూట్ 1, స్టీవ్ స్మిత్ 10 సార్లు డ‌కౌట్ అయ్యారు. వీరంద‌రిక‌న్నా ముందంజ‌లో ఉన్న కోహ్లీ 24 సార్లు డ‌కౌట్ అయ్యాడు.

గ‌త ప‌దేళ్ల‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన వారిలో హ‌ఫీజ్ 27, మార్టిన్ గ‌ప్తిల్ 26 త‌ర్వాత మూడో స్థానంలో కోహ్లీ నిల‌వ‌డం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here