క్ష‌మాప‌ణ‌లు చెప్పిన టీవీ చానెల్

0

వార్తా క‌థ‌నాల విష‌యంలో నిర్థార‌ణ లేకుండా ముందుకు సాగితే అభాసుపాలు కావాల్సి ఉంటుంది. అందులోనూ ప్ర‌భుత్వం క‌ఠినంగా ఉన్న స‌మ‌యంలో క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పాల్సి ఉంటుంది. స‌రిగ్గా ఇప్పుడు అలాంటి ప‌రిస్థితే ఏపీ 24/7 చానెల్ కి ఎదుర‌య్యింది.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ చేసిన ఓ ట్వీట్ ఆధారంగా మ‌త సామ‌ర‌స్యాన్ని దెబ్బ‌తీసే క‌థ‌నం ప్రసారం చేసి చేతులు కాల్చుకుంది. చివ‌ర‌కు త‌ప్పు నాది కాదు, క‌న్నాదే నంటూ ప్ర‌భుత్వానికి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. సాంస్కృతిక‌, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ కార్య‌ద‌ర్శి ప్ర‌వీణ్ కుమార్ నోటీసు జారీ చేయ‌డంతో ఖంగుతిన్న వెంక‌ట కృష్ణ చానెల్ ఖంగుతినాల్సి వ‌చ్చింది.

వెంట‌నే తేరుకుని నిన్న ప్ర‌సారాల‌కు వివ‌ర‌ణ ఇస్తూ, ఎవ‌రికైనా ఇబ్బంది క‌లిగి ఉంటే దానికి చింతిస్తున్నామంటూ పేర్కొంది. 2017 లో ప్రారంభించిన నిర్మాణాల సంద‌ర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన పుణ్య క్షేత్రాల‌ను కృష్ణా తీరంలో భ‌వానీపురం వ‌ద్ద చిత్రీక‌రించారు. అందులో భాగంగా గుణ‌ద‌ల మేరీమాత ఆల‌య విగ్ర‌హం కూడా అక్క‌డ రూపొందించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఆపాదిస్తూ, క్రైస్త‌వం కోణంలో క‌న్నా చేసిన ట్వీట్ ఆధారంగా ఈ చానెల్ చేసిన క‌థ‌నాలు క‌ల‌క‌లం రేపాయి. ప్ర‌భుత్వ వివ‌ర‌ణ లేకుండా చేసిన ప్ర‌సారాల‌తో చివ‌ర‌కు చానెల్ వివ‌ర‌ణ ఇచ్చుకుంటూ త‌ప్పిదాన్ని అంగీక‌రించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here