గంగూలీ అస‌లు గురి అక్క‌డే..!

0

క్రికెటర్ నుంచి ఏకంగా టీమిండియాను శాసించే బీసీసీఐ పీఠం వ‌ర‌కూ సౌర‌వ్ గంగూలీ ప‌య‌నం ఆస‌క్తిక‌రంగానే సాగింది. జ‌ట్టులో దూకుడు పెంచిన అత‌డి తీరు ఇప్పుడు రాజ‌కీయంగానూ అదే దూకుడుతో సాగుతోంది. అన్నీ క‌లిసి వ‌స్తే ఆయ‌న బెంగాల్ కి కాబోయే ముఖ్య‌మంత్రిగా ప్ర‌చారం ప్రారంభ‌మ‌య్యింది. దానికి త‌గ్గ‌ట్టుగానే ప‌ది నెల‌ల కాల‌ప‌రిమితితో మాత్ర‌మే గంగూలీకి బీసీసీఐ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్కుతోంది.

బెంగాల్ లో పాగా వేయాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ త‌గిన నాయ‌క‌త్వం లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో సానుకూల‌త‌ను సొమ్ము చేసుకోలేక‌పోతున్నామ‌ని భావిస్తోంది. ఓవైపు ప‌దేళ్ల మ‌మ‌తా బెన‌ర్జీ పాల‌న‌పై వ్య‌తిరేక‌త‌, రెండోవైపు వామ‌ప‌క్షాలు పుంజుకోవ‌డానికి త‌గిన ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ మ‌తం కార్డు ద్వారా బ‌ల‌ప‌డేందుకు బీజేపీ ప‌లు విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో సానుకూల ఫ‌లితాలు సాధించింది.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బెంగాల్ ని కాషాయ‌మ‌యం చేయాల‌ని బీజేపీ అంచ‌నాలు వేస్తోంది. అందుకు అనుగుణంగానే గంగూలీని తెర‌మీద‌కు తీసుకొస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే జార్ఖండ్ కోసం మ‌హేంద్ర‌సింగ్ ధోనీని సిద్ధం చేస్తున్న‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. దానిక‌న్నా కీల‌క‌మైన బెంగాల్ కోసం దాదా సీన్ లోకి వ‌స్తే రాజ‌కీయంగా ఇదో ఆస‌క్తిక‌ర అంశం అవుతుంది. ఇప్ప‌టికే గంభీర్ ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

అదే స‌మ‌యంలో ప‌ది నెల‌ల కాలంలో బీసీసీఐలో గంగూలీ మార్క్ ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం ఉంది. ప‌లు మార్పులు ఖాయంగా క‌నిపిస్తోంది. అందులో ఎంఎస్కే ప్ర‌సాద్ ని చీఫ్ సెల‌క్ట‌ర్ నుంచి తొల‌గించ‌డం అనివార్యం. ఆయ‌న స్థానంలో వెంగ‌స‌ర్కార్ కి చాన్స్ వ‌స్తుంద‌నే అంచ‌నాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here