గంటాపై పాత మిత్రుడు గ‌రంగ‌రం

0

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ రెచ్చిపోయారు. ఒక‌నాటి త‌న మిత్రుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావుపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ‌లో ఆయ‌న వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. గంటా ఇప్ప‌టికీ మంత్రిగానే భ్ర‌మ‌ల్లో ఉన్నారంటూ మండిప‌డ్డారు. గంటాను ఒక‌ మనిషిలా కూడా చూడను అంటూ వ్యాఖ్యానించారు.

వాస్త‌వానికి గంటా శ్రీనివాస‌రావు, అవంతి శ్రీనివాస్ రావు చాలాకాలం పాటు స్నేహితులు. ప్ర‌జారాజ్యం. కాంగ్రెస్, టీడీపీల‌లో క‌లిసి సాగారు. కానీ మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు ఇద్ద‌రికీ తీవ్ర వైరుధ్యం ఏర్ప‌డింది. ముఖ్యంగా భీమిలి అసెంబ్లీ సీటుతో పాటు విశాఖ భూ వ్య‌వ‌హారాల్లోనే త‌గాదా వ‌చ్చిన‌ట్టుగా ప్ర‌చారం సాగింది. చివ‌ర‌కు చెరో దారి ప‌ట్ట‌గా గంటా టీడీపీలో కొన‌సాగి నార్త్ నుంచి విజ‌యం సాధించారు. అవంతి భీమిలి బ‌రిలో వైసీపీ త‌రుపున విజ‌య కేత‌నం ఎగుర‌వేసి జ‌గ‌న్ క్యాబినెట్ లో విశాఖ జిల్లాకు చెందిన ఏకైక మంత్రిగా మిగిలారు.

తాజాగా అడారి ఆనంద్ , ఆయ‌న మిత్రులు టీడీపీని వీడి వైసీపీలో చేర‌డంలో అవంతి శ్రీనివాస్ కీల‌కంగా వ్య‌వ‌హిరంచారు. అన‌కాప‌ల్లి ఎంపీగా టీడీపీ త‌రుపున బ‌రిలో దిగి ఓట‌మి చ‌వి చూసిన అడారి ఆనంద్ కి విశాఖ డెయిరీ ద్వారా విస్తృతంగా ప‌రిచ‌యాలున్నాయి. ఆయ‌న టీడీపీని వీడ‌డంతో సైకిల్ స‌వారీకి మ‌రిన్ని స‌వాళ్లు త‌ప్పేలా లేవు. ఈ నేప‌థ్యంలో రాజకీయంగా సాగుతున్న చ‌ర్చ సంద‌ర్భంగా అవంతి శ్రీనివాస్ నేరుగా గురిపెట్టారు. గంటా లాంటి వారిని వైసీపీలో చేర్చుకోబోమ‌ని స్ప‌ష్టం చేశారు. మంచి వారిని మాత్ర‌మే తాము ఆహ్వానిస్తామ‌ని తేల్చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here