గంటా ఆపార్టీలోకేనంట‌..!

0

ఏపీ రాజ‌కీయాల్లో గంటా శ్రీనివాస‌రావుకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఆయ‌న ఏపార్టీలో ఉన్నా కీల‌క‌నేత‌గా సాగుతూ ఉంటారు. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా విశాఖ నార్త్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆయ‌న త్వ‌ర‌లో పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం జోరుగా ఉంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే త‌న‌కు అన్ని పార్టీల నుంచి ఆఫ‌ర్లు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పుకున్నారు.

వాస్త‌వానికి ఆయ‌న తొలుత వైసీపీ వైపు మొగ్గు చూపిన‌ప్ప‌టికీ ఆపార్టీ నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. చివ‌ర‌కు ప్ర‌య‌త్నాలు చేయ‌గా చేయ‌గా ఫ‌లించే స‌మ‌యానికి క‌మ‌ల‌నాధుల‌తో గంటా ట‌చ్ లోకి వెళ్లార‌నే స‌మాచారం జ‌గ‌న్ ని తీవ్ర ఆగ్ర‌హానికి గురిచేసింది. గంటా లాంటి నేత‌ల‌ను పార్టీలో చేర్చుకునేందుకు అంగీక‌రించ‌క‌పోయిన‌ప్ప‌టికీ ప‌లువురి ఒత్తిడితో త‌లొగ్గే ప‌రిస్థితికి వ‌చ్చిన వైసీపీ అధినేత‌కు గంటా ఎత్తులు మింగుడుప‌డ‌లేద‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో బీజేపీలో చేర‌డానికి అంతా సిద్ధం చేసుకున్న గంటాపై వైసీపీ నేత‌లు గ‌రంగ‌రం అవుతున్నారు. ముఖ్యంగా ఒక‌నాటి గంటా అనుచ‌రుడు అవంతి శ్రీనివాస్ అయితే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అమ‌రావ‌తిలో వైసీపీ చుట్టూ తిరిగి, హ‌స్తిన‌లో బీజేపీ నేత‌ల ద‌గ్గ‌ర చ‌క్క‌ర్లు కొట్ట‌డానికి సిగ్గులేదా అంటూ ఆయ‌న ప్ర‌శ్నించ‌డానికి అస‌లు కార‌ణం అదేన‌ని ప‌లువురు భావిస్తున్నారు.

త్వ‌ర‌లోనే కాషాయ గంటా ప‌య‌నం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ప‌లువురు కీల‌క నేత‌లు కూడా బీజేపీలో చేరేందుకు సంసిద్ధంగా ఉన్న త‌రుణంలో గంటా అడుగులు విశాఖ రాజ‌కీయాల‌నే కాకుండా ఏపీలో కీల‌క ప‌రిణామాల‌కు దోహ‌దం చేస్తాయ‌న‌డంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here