‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్’ గా మారిన వాల్మీకి ఎలా మెప్పించాడు?

0

తమిళ క్లాసిక్ కార్తీక్ సుబ్బరాజు” జిగర్తాండ” ను తెలుగు మాస్ సినిమాలా తయారు చేయడంలో హరీష్ శంకర్ కొంత తడబడ్డాడనే చెప్పాలి..బాగా కలిసొచ్చిన అంశం ఏమిటంటే అక్కడ బాబిసింహ చేసిన పాత్రకు వరుణ్ తేజ్ ను ఎన్నుకోవడమే..ఆ విషయంలో హరీష్ శంకర్ కు నూటికి నూరు మార్కులు…ప్రేక్షకుడికి పాత్ర నచ్చితే కదాకదనాలను పట్టించుకోకుండా పాత్రతోనే ట్రావెల్ చేస్తాడు..ఈ సినిమాలో విలన్ పాత్రను దర్శకుడు మలచిన తీరు ప్రశంసనీయం…వరుణ్ తేజ్ గెటప్,హావభావాలు,నటనలో ఒకేసారి చాలా మెట్లు ఎక్కాడనిపిస్తోంది..అతని కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర అనటంలో సందేహం లేదు…

ప్రదమార్థం మొత్తం అధర్వ మురళి,వరుణ్ తేజ్ పాత్రల పరిచయానికే సరిపోయింది.. సీన్లు వేగంగా నడుస్తాయి తప్ప కధ నడవదు..దానికి తోడు ఎక్కువ ఫోకస్ అధర్వ మీదుంటుంది కానీ వరుణ్ మీద కాదు..ద్వితీయార్థంలో గద్దలకొండ గణేష్ పాత్ర ఊపందుకొనేసరికి ప్రేక్షకుడికి అప్పటికే కొంత నీరసం వచ్చేస్తుంది..అయితే చాలాచోట్ల హరీష్ శంకర్ తన మార్క్ స్క్రీన్ ప్లే,కామెడీతో సమస్య గట్టెక్కిస్తాడు…తమిళంలో డైరెక్టర్ వ్యూ నుంచి కధ మొదలవుతుంది.. తెలుగులోకి వచ్చేటప్పటికీ హీరో వరుణ్ తేజ్ వ్యూ నుండి చూపగలగటంలో దర్శకుడు ఇబ్బంది పడ్డాడనిపిస్తోంది..ఆయంకా బోస్ ఫోటోగ్రఫీ చాలా చక్కగా ఉంది..ముఖ్యంగా ఎనభైల నాటి ఎపిసోడ్లను చాలా జాగ్రత్తగా తెరకెక్కించిన విధానం బాగుంది..అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్ అద్భుతం..మిక్కీ జే మేయర్ ఆరార్ మాస్ ప్రేక్షకులను విజిల్స్ వేయిస్తుంది..ఆనాటి హృదయం సినిమా హీరో మురళి కొడుకు అధర్వ ఆకట్టుకున్నాడు..

ద్వితీయార్థంలో వచ్చే తనికెళ్ళ భరణి ఎపిసోడ్ సినిమాకే హైలెట్…చివర్లో తమిళంలో లేని విలన్ అమ్మ ఎమోషన్ సన్నివేశాలు బాగా పండాయి..వరుణ్ తేజ్ నటనలో అక్కడక్కడా కౌరవుడు సినిమాలో నాగబాబును గుర్తుకు తెస్తాడు..సినిమాలో సినిమా పేరు సిటీమార్ అని కాకుండా గద్దలకొండ గణేష్ అనే పేరు పెట్టుకుంటే ఇప్పుడు జరుగుతున్న టైటిల్ కాంట్రవర్సీకి కరెక్ట్గా న్యాయం జరిగేది..
చివరగా కొన్ని క్లాసిక్స్ ను ముట్టుకోకపోవడమే మంచిది..ఎల్లువొచ్చి గోదారమ్మ పాటంటే అపారమైన ప్రేమ ఉన్న నాలాంటి సినీ ప్రేమికులకు చాలా బాధ కలుగుతుంది.. శ్రీదేవిని చూసిన ఆ కళ్ళతో పూజా హెగ్డేను చూడలేం..మొత్తానికి మాములుగా చూస్తే వాల్మీకి మెప్పిస్తాడు…

రివ్యూ: త్రినాథ్ రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here