చంద్ర‌బాబు కి అది చాలా అవ‌స‌రం..!

0

ఏపీలో ప్ర‌తిప‌క్ష‌నేత‌గా చంద్ర‌బాబు గ‌తంలో ప‌దేళ్ల పాటు ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. అయితే అందరికన్నా తానే అనుభ‌వ‌జ్ఞుడిన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు నేటికీ ప్ర‌తిప‌క్ష పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. పాల‌నా ప‌గ్గాలు కోల్పోయిన‌ప్ప‌టికీ ప‌లుమార్లు ఆయ‌న ఇంకా అధికారంలో ఉన్నాన‌నే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా పోలీసుల‌ను ఈ మాజీ సీఎం హెచ్చ‌రించిన తీరు అందుకు ఉదాహ‌ర‌ణ‌. పోలీసుల సంగతి ఆయ‌న బాహాటంగా . బెదిరిస్తున్న తీరు విస్మ‌య‌క‌రంగా ఉంది. బాధ్య‌త క‌లిగిన నేత‌గా ఉండి ఆయ‌న పోలీసుల‌ను హెచ్చ‌రించ‌డం, సంగ‌తి చూస్తాన‌న‌డం చ‌ట్ట‌రీత్యా నేరం అవుతుంది. చ‌ట్టం అమ‌లులో ఉన్న వారిని ప్ర‌భావితం చేసేలా ఉన్న ఆయ‌న వ్యాఖ్య‌లు నేరం కింద ప‌రిగ‌ణించే వీలుంది.

చంద్ర‌బాబు విప‌క్షంలోకి మారి నాలుగు నెల‌లు నిండింది. అప్పుడే ఆయ‌న‌లో అస‌హ‌నం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న ఓట‌మికి కార‌ణాలు క‌నుక్కుని, వాటిని స‌రిదిద్దుకుని, మ‌ళ్లీ పార్టీని గాడిలో పెట్టేందుకు ప్ర‌య‌త్నించాల్సిన ద‌శ‌లో దానికి భిన్నంగా తాను నోరిస్తే వైఎస్సార్ భ‌య‌ప‌డేవారు, అంత‌కుముందు ఇంకెవ‌రో హ‌డ‌లిపోయేవారు అంటూ ఆయ‌న చెప్పుకోవ‌డం విశేషంగా చెప్ప‌వ‌చ్చు. తొలుత ప్ర‌భుత్వానికి కొంత స‌మ‌యం ఇచ్చి, త‌ప్పొప్పులు బేరీజు వేసుకుని ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌, అసంతృప్తి జాడ‌లు క‌నిపిస్తే సొమ్ము చేసుకునేందుకు అనుగుణంగా ఆరు నెల‌ల కాలం ఇచ్చి ఆచ‌ర‌ణ‌లోకి దిగాల్సింది పోయి ఆయ‌న రెండు నెల‌ల‌కే రంగం మీద‌కు వ‌చ్చారు. మూడు నెల‌ల‌కే గృహనిర్బంధం అయిపోయారు. నాలుగు నెల‌ల‌కే పోలీసుల‌ను హెచ్చ‌రించే ద‌శ‌కు వ‌చ్చేశారు.

మిగిలిని నాలుగున్న‌ర నెల‌ల పైబ‌డిన కాలం ఏం చేయాల‌న్న‌దే టీడీపీ నేత‌కు అంతుబ‌ట్ట‌ని విష‌యం అవుతుంది. క‌నీసం ఆయ‌న అనుభ‌వానికి అనుగుణంగా ఆలోచించి, ఆచితూచి అడుగులు వేస్తే అంద‌రూ ఆహ్వానిస్తారు. జ‌నం ఆయ‌న్ని ఛీత్క‌రించి ఇంకా నాలుగు నెల‌లు గ‌డ‌వ‌క‌ముందే జై కొడ‌తార‌నే భ్ర‌మ‌ల‌కు ఆయ‌న రావ‌డం రాజ‌కీయంగా పెద్ద త‌ప్పిదంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీకి పెద్ద న‌ష్టాన్ని తీసుకురాబోతోంది. విప‌క్షంగా కూడా టీడీపీ విఫ‌ల‌మ‌య్యింద‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు ప‌డాల్సి ఉంది. లేకుండా చ‌రిత్ర‌లోనే అతి త‌క్కువ సీట్ల‌తో స‌రిపెట్టుకున్న టీడీపీ మ‌రిన్ని ఇక్క‌ట్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ప‌రిశీల‌కుల అంచ‌నా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here