చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు జ‌గ‌న్ చేస్తే..!

0

ఏ ప్ర‌భుత్వానిక‌యినా కొన్ని విధానాలుంటాయి. సొంత ఆలోచ‌న‌లుంటాయి. ఏపార్టీ అధికారంలోకి వ‌స్తే వారి అవ‌స‌రాలు, అవ‌కాశాల‌ను బ‌ట్టి పాల‌న సాగిస్తుంటారు. ప్ర‌తిప‌క్షాలు త‌మ విధానాల‌ను బ‌ట్టి ప్ర‌భుత్వాల తీరుని విమ‌ర్శిస్తూ ఉంటాయి. కానీ ఏపీలో ఇప్పుడు చంద్ర‌బాబు త‌న విధానం అమ‌లు కావాల్సిందేనంటున్నారు. ఏపీలో ఆయ‌న పాల‌న‌ను ప్ర‌జ‌లు తిర‌స్క‌రించిన త‌ర్వాత కూడా త‌న ధోర‌ణిలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఇసుక స‌మ‌స్య తీవ్రంగా ఉన్న రాష్ట్రంలో స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌తిప‌క్షాలు పోరాడుతున్నాయి. అదే స‌మ‌యంలో ప‌రిష్కార‌మార్గాలు కూడా సూచిస్తున్నాయి. కానీ చంద్ర‌బాబు మాత్రం ఇసుక‌ని ఉచితంగా అందించాల‌ని, అప్పుడే స‌మ‌స్య తీరుతుంద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు హ‌యంలో ఉచిత ఇసుక విధానం అమ‌లు చేశారు. దాని ఫ‌లితాల‌ను జ‌నం అనుభ‌వించారు. ఎన్ని స‌మ‌స్య‌లను జ‌నం అనుభ‌వించారో చెప్ప‌డానికి వ‌న‌జాక్షి వ‌ర‌కూ అవ‌స‌రం లేదు..చిన్నపాటి నిర్మాణాలకు సిద్ధ‌ప‌డిన అంద‌రికీ అనుభ‌వ‌మే. అదే స‌మ‌యంలో ఇసుక మాఫియాలో ఉచితం మాటున వెలిసిన టీడీపీ నేత‌ల ఆస్తుల కోట‌లు కూడా జ‌నం చూసిన త‌ర్వాతే అలాంటి తీర్పు వ‌చ్చింద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం.

అయినా విఫ‌ల‌మ‌యిన విధానం మ‌ళ్లీ తీసుకురావాల్సిందేన‌ని చంద్ర‌బాబు ప‌ట్టుబ‌ట్ట‌డ‌మే విచిత్రం. అంతేగాకుండా త‌న ప్ర‌త్య‌ర్థి పార్టీ కూడా త‌న విధానాల‌ను అమ‌లు చేయాల‌ని ఆశించ‌డ‌మే కాకుండా, అదే ప‌రిష్కారం అంటూ చంద్ర‌బాబు వ‌ల్లించ‌డం గ‌మ‌నిస్తుంటే తెలుగుదేశం పార్టీ విధానాల‌ను స‌వ‌రించుకుని, స‌ర‌యిన దారిలో ప‌య‌నించ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవాల‌నే ఆలోచ‌న‌తో ఉందా లేదా అనే అనుమానం క‌లుగుతోంద‌ని ఓ పాత్రికేయుడు చేసిన వ్యాఖ్య గ‌మ‌నార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here