చంద్ర‌బాబు మ‌రో యూట‌ర్న్?

0

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి మ‌రోసారి యూ ట‌ర్న్ తీసుకునేలా క‌నిపిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న మ‌ళ్లీ త‌న పాత పంథాలో ప‌య‌నించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. తాజా ప‌రిణామాలు గ‌మ‌నిస్తుంటే ఏపీలో కొత్త కూట‌మి ఖాయంగా ఉంది. 2014 ఎన్నిక‌ల్లో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసిన ఆ ముగ్గ‌రు మ‌ళ్లీ చేతులు క‌ల‌ప‌బోతున్నార‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

చంద్ర‌బాబు యూట‌ర్న్ బాబు అంటూ ఏకంగా ప్ర‌ధాని మోడీ కూడా విమ‌ర్శించారు. అంతే స్థాయిలో చంద్ర‌బాబు కూడా బీజేపీ మీద విరుచుకుప‌డ్డారు. అదంతా 2019 ఎన్నిక‌ల‌కే ప‌రిమితం అన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. మ‌ళ్లీ ఆ ఇద్ద‌రూ వేదిక పంచుకుంటార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. అంతేగాకుండా వారిద్ద‌రికీ ఉమ్మ‌డి మిత్రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా జ‌త‌గ‌డ‌తార‌ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క‌నేత‌లు ఇటీవ‌ల కాషాయ కండువాలు క‌ప్పుకున్నారు. చంద్ర‌బాబు ఆత్మీయులు కూడా ఈ ఖాతాలో ఉన్నారు. ఇక తాజాగా చంద్ర‌బాబు కోట‌రీకి చెందిన మీడియా సంస్థ అధినేత, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కూడా అమిత్ షాతో భేటీ కావ‌డం వెనుక అస‌లు ల‌క్ష్యం అదేన‌నే అంచ‌నాలు వేస్తున్నారు.

వాస్త‌వానికి టీడీపీ చ‌రిత్ర‌లోనే తొలిసార‌గి మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలో దిగింది. నిండామునిగిపోయింది. అత్యంత త‌క్కువ సీట్ల‌కు ప‌రిమితం అయిపోయింది. ఇప్పుడు పార్టీ త‌రుపున గెలిచిన వారిలో కూడా కొంద‌రు బీజేపీ గూటికి చేరాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ చంద్ర‌బాబు , బీజేపీ మ‌ళ్లీ జ‌ట్టు క‌ట్ట‌బోతున్నాయ‌నే సంకేతాల‌తోనే వారంతా త‌మ ప్ర‌య‌త్నాలు ఉప‌సంహ‌రించుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

ఏపీలో జ‌గ‌న్ ని ఎదుర్కొని నిల‌బ‌డాలంటే అదొక్క‌టే మార్గ‌మ‌నే నిర్ణ‌యానికి టీడీపీ అధినేత వ‌చ్చిన‌ట్టుగా భావిస్తున్నారు. టీడీపీని కాపాడుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న చంద్ర‌బాబు ఓ మెట్టు కింద‌కి దిగి మ‌ళ్లీ పొత్తు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఏపీలో బీజేపీ నేత‌లకు ఈ ప‌రిణామాలు మింగుడుప‌డే అవ‌కాశం లేద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here