చిక్కుల్లో చంద్ర‌బాబు:చుట్టుముడుతున్న కేసులు

0

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చిక్కుల్లో ప‌డుతున్నారు. టీడీపీ అధినేత‌కు తీవ్ర ఇక్క‌ట్లు త‌ప్పేలా లేవు. రాజ‌కీయంగా కొంత స‌త‌మ‌త‌మ‌వుతున్న వేళ ఇప్పుడు న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. ఇప్ప‌టికే రెండు ద‌శాబ్దంన్న‌ర కింద‌టి అక్ర‌మాస్తుల కేసు ముందుకొచ్చింది. ఏసీబీ కోర్ట్ డిసెంబ‌ర్ 6న బాబు భ‌విత‌వ్యం తేల్చ‌బోతోంది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఓటుకు నోటు కేసు కూడా వెంటాడుతోంది. తాజాగా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి మ‌ళ్లీ సుప్రీంకోర్ట్ కి వెళ్లారు.

2015వ సంవ‌త్స‌రంలో జ‌రిగిన తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ స‌న్ కి ఓటుకి 5 కోట్లు ఇస్తూ నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి చిక్కుకున్నారు. త‌ర్వాత జైలుకి కూడా వెళ్లారు. ఈకేసులో చంద్ర‌బాబు బ్రీఫ్డ్ మీ అంటూ వాయిస్ సాక్షిగా దొరికిపోవ‌డంతో ఆయ‌న మీద విచార‌ణ చేయాల‌ని ఆర్కే కోరుతున్నారు. అనేక ర‌కాలుగా ఆయ‌న న్యాయ‌పోరాటం సాగిస్తున్నారు. అందులో భాగంగా సుప్రీంకోర్ట్ లో వేసిన కేసు విచార‌ణ‌కు రాక‌పోవ‌డంతో ఇప్పుడు మ‌రో పిటీష‌న్ వేసి వెంట‌నే విచార‌ణ‌కు తీసుకురావాల‌ని కోరుతున్నారు.ఇ ది చంద్ర‌బాబుకి స‌మ‌స్య‌గా మార‌బోతోంది.

అదే స‌మ‌యంలో ల‌క్ష్మీ పార్వ‌తి కేసు కూడా ముందుకొచ్చింది. కోర్ట్ స్టే ర‌ద్దు చేయ‌డంతో బాబు విచార‌ణ‌కు హాజ‌రుకాక త‌ప్పేలా లేదు. ఆ పరిస్థితుల‌లో రెండు కేసులు ఏక‌కాలంలో ముందుకు వ‌స్తున్న వేళ బాబు పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఇరుక్కుంటున్నారా అనే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here