చిదంబ‌రంతో ఏపీ మాజీ సీఎం లావాదేవీలు: బీజేపీ వైపు చూపు

0

రాజ‌కీయాల్లో ఏదీ శాశ్వ‌తం కాద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. తాజాగా అలాంటి ప‌రిణామాల‌కు చిదంబ‌రం అరెస్ట్ వ్య‌వ‌హారం దోహ‌దం చేస్తోంది. ఇప్ప‌టికే జైరామ్ ర‌మేష్ కూడా జై మోడీ అనేశాడు. దాంతో కాంగ్రెస్ వ్య‌వ‌హారాలు మ‌రింత కుదేల‌వుతున్న‌ట్టుగా స్ప‌ష్టం అవుతోంది. తాజాగా చిదంబ‌రం తాకిడి చెన్నైని అనుకుని ఉన్న చిత్తూరు జిల్లాకి చెందిన మాజీ సీఎంని తాక‌బోతున్న‌ట్టు చెబుతున్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ లో ఉన్న మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి కండువా మార్చుకోవ‌డానికి అంతా సిద్ధ‌మ‌యిన‌ట్టు ప్ర‌చారం మొద‌ల‌య్యింది.

కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రంతో కిర‌ణ్ కుమార్ రెడ్డికి సుదీర్ఘ‌కాలంగా స్నేహం ఉంది. హ‌స్తిన‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో కిరణ్ కి అన్ని ర‌కాలుగానూ చిదంబ‌రం నుంచి ఆశీస్సులు ద‌క్కిన‌ట్టుగా చెబుతుంటారు. చివ‌ర‌కు అప్ప‌ట్లో కిర‌ణ్ కుమార్ రెడ్డి స‌ర్కారుపై వైసీపీ నేత‌లు అవిశ్వాసం ప్ర‌క‌టించిన స‌మ‌యంలో చంద్ర‌బాబు కూడా కిర‌ణ్ స‌ర్కారుకి మ‌ద్ధ‌తు అందించ‌డంలో కూడా చిదంబ‌రం హ‌స్తం ఉంద‌ని కొంద‌రి అభిప్రాయం. అంతేగాకుండా చిదంబ‌రం ఆర్థిక‌వ్య‌వ‌హారాల్లో కూడా కిర‌ణ్ కుమార్ రెడ్డికి పాత్ర ఉంద‌నే అనుమానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా సొంత‌పార్టీ పెట్టుకుని బ‌య‌ట‌కు వెళ్ల‌డం, మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికే చేర‌డం కూడా చిదంబ‌రం త‌ర‌హాలోనే కిర‌ణ్ ప్ర‌స్థానం సాగిన‌ట్టుగా చెబుతుంంటారు.

చిదంబ‌రం ఆర్థిక లావాదేవీల‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు వేగంగా పావులు క‌దుపుతున్న త‌రుణంలో ప‌లువురి గుట్టుర‌ట్టు చేసేందుకు అంతా సిద్ధ‌మ‌య్యింద‌నే స‌మాచారం వినిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో వీల‌యినంత త్వ‌ర‌గా బీజేపీ తో స‌న్నిహిత సంబంధాల కోసం స్నేహ హ‌స్తం చాసేందుకు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు క్యూ క‌డుతున్నారు. జైరాం ర‌మేష్ వ్య‌వ‌హారం అందులో భాగ‌మేన‌ని, ఇంకా మ‌రికొంద‌రు కూడా ఉంటార‌ని భావిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే కిర‌ణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరేందుకు అంతా సిద్ద‌మ‌య్యింద‌నే ప్ర‌చారం మొద‌ల‌య్యింది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే బీజేపీ నేత‌లు కిర‌ణ్ తో చ‌ర్చ‌లు జ‌రిపారు. కానీ ఆయ‌న మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇక ఇప్పుడు అనివార్య ప‌రిస్థితుల్లో తాను కోలుకోవాలంటే క‌మ‌లం క్యాంపులో చేర‌డం ఒక్క‌టే అని నిర్థార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. సుజ‌నా, సీఎం ర‌మేష్ వంటి వారి త‌ర్వాత కిర‌ణ్ కూడా అదే రూటులో వెళ్లేందుకు ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న ఈ మాజీ ముఖ్య‌మంత్రి ఇండియాకు రాగానే ఏర్పాట్లు చేసుకుంటార‌ని స‌మాచారం.

అప్ప‌ట్లో ప్ర‌జ‌ల్లో బ‌లం లేక‌పోయిన‌ప్ప‌టికీ అధిష్టానం ఆశీస్సుల‌తో ఏకంగా ముఖ్య‌మంత్రి హోదా ద‌క్కించుకున్న కిర‌ణ్ కుమార్ రెడ్డి చేరిక బీజేపీ బ‌లోపేతానికి దోహ‌దం చేస్తుందా లేదా అన్న‌ది ప‌క్క‌న పెడితే వ్య‌క్తిగ‌తంగా కిర‌ణ్ కి మాత్రం భ‌రోసా ద‌క్కుతుంద‌నే వారు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here