చిరంజీవిని నేనేమీ అన‌ల‌దేంటున్న చెవిరెడ్డి

0

వైసీపీ ఎమ్మెల్యే, తుడా చైర్మ‌న్ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు. మెగాస్టార్ చిరంజీవి మీద ఆయ‌న చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఆయ‌న స్పందించారు. త‌న‌కు, ఆ పోస్ట్ కి సంబంధం లేద‌ని తేల్చేశారు. కావాల‌ని టీడీపీ చేసిన కుట్ర‌గా ఆయ‌న అభివ‌ర్ణిస్తున్నారు.

ఏపీ సీఎం జ‌గ‌న్ తో ఈనెల 14న చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ భేటీ కాబోతున్నారు. సైరా సినిమా చూడ‌డానికి ఆహ్వానించే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో గ‌తంలో రామ్ చ‌ర‌ణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నంలో ఉంచుకుని చిరంజీవిపై చెవిరెడ్డి పోస్ట్ చేశారంటూ కొన్ని వ్యాఖ్య‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.

ఈ వ్య‌వ‌హారం చివ‌ర‌కు చిరంజీవి అభిమానుల‌కు, వైసీపీకి మ‌ధ్య వైరంగా మారే ప్ర‌మాదం ఉంద‌ని గ్ర‌హించి ఆయ‌న స్పందించారు. తన పేరుతో ఎవరో తప్పుగా ప్రచారం చేశారని, ఫేస్‌బుక్‌లో తిరుగుతున్న పోస్ట్‌ నేను పెట్టింది కాదని వివరణ ఇచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎటువంటి గొడవలు లేవని, చిరంజీవిపై తన అభిమాన సంఘం పేరుతో వైరల్ అవుతున్న వార్తలను చెవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆ పోస్టింగులకూ తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు ట్విట్టర్‌ అక్కౌంట్లు కాని, ఫేస్‌బుక్‌ అక్కౌంట్లు కానీ లేవని వెల్లడించారు. తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (తుడా) ఛైర్మన్‌గా ఉన్న రోజుల్లో చిరంజీవి ఎమ్మెల్యేగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు చెవిరెడ్డి. అప్పటి నుంచి ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. జగన్, చిరంజీవి మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీయే ఈ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు చెవిరెడ్డి.

దాంతో ఈ వ్య‌వ‌హారం తిరుప‌తిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చిరంజీవిపై త‌న అభిమానుల పేరుతో సాగుతున్న ప్రచారం త‌న‌కు సంబంధం లేద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ చెవిరెడ్డి ఎందుకు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేద‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై పోలీసులు జోక్యం చేసుకుని విచార‌ణ జ‌రిపించాల‌ని కొంద‌రు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here