చిరుకి జంట‌గా ఇలియానా..!

0

మెగాస్టార్ జోరు పెంచుతున్నాడు. ఇప్ప‌టికే సైరా సిద్ధం చేసిన చిరు తాజాగా నెక్ట్స్ మువీ స‌న్నాహాలు షురూ చేశాడు. అందుకు త‌గ్గ‌ట్టుగా టాలీవుడ్ లో కి మ‌ళ్లీ గోవా బ్యూటీ క‌నిపించేందుకు త‌గ్గ‌ట్టుగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

గోవా బ్యూటీ ఇలియానా మళ్లీ టాలీవుడ్‌లో యాక్టివ్ అవుతోంది. చాలా గ్యాప్ తరువాత మళ్లీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన నటించబోతోందనే టాక్ బాగా వినబడుతోంది. బోయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోస్ నుంచి విడిపోయిన తరువాత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఆ జ్ఞాపకాల నుంచి బయటపడేందుకే సినిమాల్లో బిజీ అవుతోందని టాక్ నడుస్తోంది.

చిరు, కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ కోసం కొరటాల సెర్చింగ్ స్టార్ట్ చేశారట. ఈ క్రమంలో నయనతార, అనుష్క తదితరులను సంప్రదించినట్టు వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో ఇల్లీబేబీ కూడా యాడ్ అయిందట. అంతా ఓకే అయితే చిరు సరసన ఇల్లీబేబీ నటించడం ఖాయంగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here