ఛాన్సివ్వ‌కుండానే శ్యాంస‌న్ కి అన్యాయం

0

టీమిండియా ఎంపిక‌లో మ‌రోసారి ఉత్త‌రాది లాబీయింగ్ బ‌లం చూపింది. సౌత్ ఇండియ‌న్ సంజూ శాంస‌న్ కి మొండి చేయి చూపారు. అపార ప్ర‌తిభ ఉన్నా అవ‌కాశం ఇవ్వ‌కుండానే జ‌ట్టు నుంచి తొల‌గించారు. దాంతో వ‌చ్చే విండీస్ సిరీస్ కి రిష‌భ్ పంత్ కొన‌సాగుతూనే సంజూ చోటుకి ఎస‌రు త‌గిలింది.

బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే టెస్ట్ మ్యాచ్ తర్వాత టీం ఇండియా వెస్టిండీస్‌తో తలపడనుంది. భారత్‌లో పర్యటించే కరేబియన్ జట్టుతో ఆతిథ్య జట్టు మూడు వన్డేలు, మూడు టీ-20ల్లో తలపడనుంది. ఈ సిరీస్‌లో తలపడే ఆటగాళ్ల వివరాలను బీసీసీఐ ప్రకటించింది. రెండు ఫార్మాట్లలో విరాట్ కోహ్లీనే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయంతో వెస్టిండీస్ పర్యటనకు, బంగ్లాదేశ్‌ సిరీస్‌కు దూరమైన భువనేశ్వర్ కుమార్ ఈ సిరీస్‌తో జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఈ సిరీస్ లో మిడిలార్డ‌ర్ లో ఇప్ప‌టికే అనేక అవ‌కాశాలు వ‌చ్చినా చేజార్చుకుని, వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్న రిష‌భ్ పంత్ ని కొన‌సాగించ‌డంపై ప‌లువురు క్రికెట్ అభిమానులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. యంగ్ టాలెంట్ వికెట్ కీప‌ర్ల‌ను కాద‌ని ఫెయిల్యూర్ పంత్ ని కొన‌సాగించ‌డానికి కార‌ణాల‌పై నిల‌దీస్తున్నారు. అదే స‌మ‌యంలో సంజూ శ్యాంస‌న్ ని జ‌ట్టులోకి తీసుకుని ఛాన్స్ ఇవ్వ‌కుండానే వెన‌క్కి పంపుతారా అంటూ నిల‌దీస్తున్నారు.

వన్డే జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్

టీ-20 జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here