జగన్ నోరు మెదపరేమి?

  0

  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌనం ఇప్పడు పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తోంది. తిరుమల వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల విషయంలో వెనువెంటనే స్పష్టతనిచ్చిన సీఎం పేషీ రాజధాని విషయంలో ఎందుకు నాన్చుతోంది అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగానే తన నిర్ణయం చెప్పకపోవడంతో సందేహాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ తీరు మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం గడిచిన ఐదేళ్లుగా ఆసక్తికర అంశంగానే ఉంటోంది. అనునిత్యం చర్చనీయాంశం అవుతోంది. తొలుత రాజధాని ఎక్కడా అన్న అంశంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత రాజధాని అమరావతిగా ప్రకటించిన తర్వాత ఆర్భాటంగా శంకుస్థాపన, ఆతర్వాత డిజైన్లు, తాత్కాలిక నిర్మాణాలు అన్నింటా రాజకీయాలు తిరిగాయి. ఇక ఇప్పుడు అధికార మార్పిడి తర్వాత మూడు నెలలుగా రాజధాని పనులు దాదాపుగా నిలిచిపోయాయి. ఇప్పుడు బొత్సా ప్రకటన తర్వాత అసలు రాజధాని ఉంటుందా, లేక మారుతుందా అన్న చర్చ కూడా మొదలయ్యింది.

  అన్ని పార్టీల నేతలు అమరావతిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాజధాని మార్పు మీద దాదాపుగా అందరూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అభివ్రుద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్న వారు కూడా అమరావతి నుంచి రాజధాని మార్పిడిని ఈ సమయంలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పాలనా కేంద్రంగా అమరావతిని కొనసాగిస్తూ అవసరమైన ప్రాంతంలో అభివ్రుధ్ది కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ స్థాయిలో చర్చ సాగుతున్నప్పటికీ వైసీపీ అధినేత మాత్రం మౌనంగా ఉన్నారు.

  ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ జగన్ మాత్రం నోరు మెదపకపోవడం విశేషంగా మారుతోంది. ఆయన మౌనం వెనుక అసలు ఉద్దేశాలు ఏమిటన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. దాంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం ఎప్పటికీ నోరు విప్పుతారో..రాజధాని వ్యవహారం ఎన్నిటికీ క్లారిటీ వస్తుందన్నది అంతుబట్టని విషయంగా కనిపిస్తోంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here