జగన్ బాటలో పలువురు ముఖ్యమంత్రులు

0

ఆంధ్రప్రదేశ్ ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని వైఎస్ జగన్ ప్రకటించారు. దేశమంతా మనవైపు చూసేలా మారుస్తానని కూడా అన్నారు. తాజాగా పరిస్థితులు అదే రీతిలో కనిపిస్తున్నాయి. జగన్ నిర్ణయం పట్ల పలు అభ్యంతరాలు, అమలు పట్ల అనేక అనుమానాలు ఉన్నప్పటికీ తాజాగా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాము కూడా అమలు చేస్తామని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నారు.

ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప అదే ప్రకటన చేశారు. తాజాగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో కూడా స్థానికులకు రిజర్వేషన్ల నిర్ణయంలో ఏపీని ఫాలో అయ్యేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎంపీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ స్వతంత్య్రదినోత్సవం నాడు ఈ ప్రకటన చేశారు

మధ్యప్రదేశ్‌లో కూడా 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు చట్టం చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాధ్‌ ప్రకటించారు. భోపాల్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈ నిర్ణయం ప్రకటించారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. రాష్రంలోని పారిశ్రామిక యూనిట్లలో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వ్‌ చేస్తూ చట్టం చేస్తామని వెల్లడించారు. యువతకు నైపుణ్యాలను పెంచి, వారికి గౌరవప్రదమైన ఉద్యోగాలు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

దాంతో ఇప్పుడు పలు రాష్ట్రాలలో స్థానికులకు ఉద్యోగాలు అనే నినాదం ముందుకు వస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ విషయంలో ఏపీలో పడిన తొలి అడుగు అన్ని చోట్లా అమలవుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగు వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ముఖ్యంగా బెంగళూరులో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ నుంచి జగన్ తీరు మీద అభ్యంతరాలు వ్యక్తం అవుతుండడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here