జార్జిరెడ్డి: సాధార‌ణ సినిమాగా మిగిలిపోయిందా?: మువీ రివ్యూ

0

బయోపిక్ ఎప్పుడైనా సాహసమే. గీతకు అడుగు అవతల వేస్తే వాస్తవానికి దూరంగా ఉందని, అడుగు ఇవతలే ఉంటే డాక్యుమెంటరీని తలపిస్తోందని అంటారు. ఇక, ఒక్కోసారి ప్రమాదకరం కూడా.. ఇదిగో ఇలా జార్జ్ లాంటి వ్యక్తిని, కాదు కాదు.. శక్తిని ఎంచుకున్నప్పుడు! మత ఉన్మాదుల చేతుల్లో దారుణంగా బలైన జార్జ్ ను.. అదే ఉన్మాదం దేశం నలుదిక్కులా పెచ్చరిల్లుతున్న వేళ తెరపై చూపించ డానికి సిద్ధపడటం సాహసమే కాదు అంతకుమించి. తేడా వస్తే.. చిన్న సంతకంతో రెడ్ సీల్ పడిపోయి స్టోర్ రూమ్ లో సినిమా చెదలు పట్టిపోగలదు. ఇలాంటి పరిస్థితుల్లో జార్జ్ ను డైరెక్టర్ ఏం చేశాడు..?

…. STORY…
జార్జ్ కు చిన్ననాటి నుంచే తప్పును సహించే గుణం లేదని చెప్పిన డైరెక్టర్.. త్వరగా అతన్ని ఉస్మానియా మెట్లు ఎక్కించాడు. వస్తూ వస్తూనే అమ్మాయిలను రాగింగ్ చేసేవాళ్లకు, భోజనం సరిగా పెట్టని కాంట్రాక్టర్ల కూ తన చేతి దెబ్బ రుచి చూపించడం ద్వారా తన సంకేతాలను ఇటు ప్రత్యర్థులకు.. అటు కాలేజీకి చాటిచెప్పాడు. ఇదే పంథా ఇంటర్వెల్ వరకూ సాగుతుంది. ఈ క్రమంలోనే ఏడాదిపాటు కాలేజ్ నుంచి తొలగించబడతాడు. అయినా.. లైబ్రరీ వేదికగా చదువును కొనసాగిస్తూ.. ఇటు అధ్యయనం అటు పోరాటం జమిలీగా నడిపిస్తాడు.
రెండో భాగంలో తన పోరాటాన్ని విద్యార్థి సమస్యకు మాత్రమే పరిమితం చేయకుండా రైతు, ఇతరత్రా సామాజిక అంశాలను మేళవిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తాడు. ఉస్మానియాలోని విద్యార్థి సంఘాల వెనకున్న బూర్జువా పార్టీల వరకూ జార్జ్ సెగతగలడంతో అతని అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఈ క్రమంలో ఓ సారి ప్రాణాలతో బయటపడ్డ జార్జ్.. చివరకు ఓ మిత్రుని నమ్మక ద్రోహం కారణంగా అదే మత ఉన్మాదులకు బలైపోతాడు.

…..ANALYSIS….
ఉస్మానియాకు రావడంతోనే అన్యాయంపై తిరుగు బావుటా ఎగరేసిన జార్జ్.. ఇంటర్వెల్ వరకూ ఇదే రూపంలో కనిపించడం విసుగు తెప్పిస్తుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం అరాచకాన్ని నేరుగా చూపించలేదు. ఎక్కువ భాగం కాలేజీ గ్రూపుగొడవల్లాగే చిత్రీకరించారు. ఆ విద్యార్థి సంఘాన్ని నేరుగా చూపిస్తే.. దాని వెనకున్న రాజకీయ పార్టీని అనివార్యంగా తెరపైకి తేవాలి. అదే జరిగితే సినిమా విడులపైనే ప్రభావం పడొచ్చు. సో.. తనకున్న కొద్దిపాటి spaceలోనే జార్జ్ పోరాటం మొత్తం చూపిం చాల్సి వచ్చింది. అందుకే.. రాజ్యానికి వ్యతిరేకంగ జార్జ్ క్యారెక్టర్ పిలుపు ఇస్తుంది కానీ.. రాజ్యాన్ని నడి పేది ఎవరు? అనేది చూపించలేదు. పోరాటం ఎవరి మీద? ముగింపు ఎలా? అనేది అర్థం చేయించలేదు. చివరకు.. సదరు విద్యార్థి సంఘం వారు రెచ్చగొడితే వేరేవాడెవడో చంపినట్టు చూపించారు.

……CHARECTORS….
జార్జ్ గా హీరో సందీప్ మాధవ్ చక్కగా సరిపోయా డు. అయితే.. కావాల్సినన్ని డైలాగులు లేకపోవడం మైనస్. హీరోయిన్ కు పెద్దగా స్కోప్ లేకపోయినా.. గొడవలతో నిండిన మొదటి భాగంలో రిలాక్స్ అయ్యే లా చేసింది. ఇతర పాత్రలు పర్వాలేద నిపించాయి. చివరగా జార్జ్ ను స్నేహితుడే నమ్మించి శత్రువుల వద్దకు తీసుకెళ్లడం.. చావుతో అతను చేసిన పోరాటం రోమాంచితంగా నిలుస్తుంది.

….Final Touch…
“వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు..
వాడి పోరాటంలో ఉంది చెగువేరా ట్రెండు..”

రివ్యూ: న‌క్కా రాధాకృష్ణ‌, సీనియ‌ర్ జర్న‌లిస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here