జ‌గ‌న్ ఒక‌టి త‌ల‌స్తే..జ‌నంలో మ‌రోటి!

  0

  ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అంచ‌నాల‌కు , ఆలోచ‌న‌ల‌కు విరుద్ధంగా క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారం క‌నిపిస్తోంది. ఏపీలో అవినీతిని అరిక‌ట్టి, పార‌ద‌ర్శ‌క పాల‌న ద్వారా ప్ర‌జ‌ల్లో పాగా వేయాల‌ని ఆయ‌న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఇప్ప‌టికే దానికి సంబంధించిన ప‌లు పాల‌సీల‌ను రూపొందించారు. కానీ వాటి అమ‌లు మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతుండ‌డంతో జ‌గ‌న్ ఒక‌టి అనుకుంటే జ‌నంలో మ‌రోటి క‌నిపిస్తుంద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది.

  గ్రామీణ ప‌రిపాల‌న‌లో స‌మూల మార్పుల కోసం రూపొందించిన స‌చివాల‌య వ్య‌వ‌స్థ ఇంకా గాడిన‌ప‌డ‌లేదు. నెల దాటుతున్నా పుర‌టి క‌ష్టాల్లోనే సాగుతోంది. ఈలోగా ప‌లు వివాదాలు చుట్టుమ‌డుతున్నాయి. వాటిని ప‌రిష్క‌రించేలోగా మ‌రో స‌మ‌స్య వ‌చ్చిప‌డుతోంది. ఇసుక విష‌యంలో ప‌ట్టుద‌ల‌గా పార్టీ నేతలంద‌రినీ క‌ట్ట‌డి చేయాల‌నే ఆలోచ‌న‌తో జ‌గ‌న్ ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఆన్ లైన్ విధానం ముందుకు తెచ్చారు. కానీ అనేక చోట్ల బెల్లం చుట్టూ ఈగ‌లు చేరిన చందంగా ఇసుక చుట్టూ అధికార పార్టీ పెద్ద‌లు వాలిపోయారు. అందిన‌కాడికి అందిపుచ్చుకోవ‌డమే ప‌నిగా మొద‌లెట్టేశారు. ఇది సామాన్యుడిలో మంట‌పుట్టిస్తోంది. మంచి జ‌రుగుతుందంటే కొన్ని స‌మ‌స్యలు ఎదుర్కుందామ‌ని ఆలోచించిన వారికి కూడా అస‌లు జ‌రుగుతున్న తీరు చూసి ఆగ్ర‌హం పుడుతోంది. సామాన్యుడికి ద‌క్క‌ని వ్య‌వ‌హ‌రం అడ్డ‌గోలుగా త‌ర‌లిపోతుంటే ప్ర‌జాగ్ర‌హం ప్ర‌స్ఫుటం అవుతోంది.

  మ‌ద్యం విష‌యంలో కూడా నియంత్ర‌ణ చేయాల‌ని అధినేత ఆలోచిస్తుంటే అందుకు విరుద్ధంగా కొంద‌రు నేత‌లు ఆలోచిస్తున్నారు. గ‌తంలో మ‌ద్యం మాఫియాలో ముఖ్య‌భూమిక పోషించిన నేత‌లంతా ఇప్పుడు వివిధ మార్గాల్లో త‌మ మార్క్ లిక్క‌ర్ వ్య‌వ‌హారాలు సాగిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ ల‌క్ష్యాలు ఏమేర‌కు నెరవేరుతాయ‌న్న‌ది సందేహంగా మారుతోంది. స‌ర్కారు స‌మ‌ర్థ‌త‌ను ప్ర‌శ్నార్థ‌కంగా మారుస్తోంది. ప్ర‌జాక్షేత్రంలో ప‌రిస్థితులు భిన్నంగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌భుత్వ అధినేత ప‌ట్టుద‌ల క్ర‌మంగా నీరుగారిపోయే ప్ర‌మాదం కూడా ఉంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. అయితే జ‌గన్ వ్య‌క్తిత్వం రీత్యా చివ‌రి వ‌ర‌కూ తాను అనుకున్న ల‌క్ష్యాల కోసం నిల‌బ‌డే నాయ‌కుడు కావ‌డం వ‌ల్ల ఈ ప‌రిణామాలు ఎటు దారితీస్తాయ‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశ‌మే.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here