జ‌గ‌న్ కి శంక‌ర్ రావు: ర‌వి ప్ర‌కాశ్ కి విజ‌య‌సాయిరెడ్డి

0

టీవీ9 అనే సంస్థ త‌న సృష్టిగా భావించుకునే ర‌వి ప్ర‌కాశ్ ఇప్పుడు క‌ష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న చంచ‌ల్ గూడ జైలు పాల‌య్యారు. ఖైదీ నెంబర్ 4412గా మారిపోయారు. మెరుగైన సమాజం ముసుగులో tv9 పేరు తో రవిప్రకాష్ – మూర్తి – క్లిఫర్డ్ పెరారీ ల 18 కోట్ల దోపిడి అధారాలతో దొరికిపోయిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు. వాటికితోడుగా ఆయన మెడ చుట్టూ ఈడి – సీబిఐ – మనీ లాండరింగ్ కేసులు కూడా చుట్టుకోబోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కాలం క‌లిసిరానప్పుడు తాడే పామై క‌రుస్తుంద‌న్న‌ట్టుగా ర‌వి ప్ర‌కాశ్ ప‌రిస్థితి మారిపోయింది.

ఇప్పటికే రవిప్రకాష్ పై 420 – 418 – 409 సెక్షన్లు కింద కేసులు నమోదయ్యాయి. ర‌వి ప్ర‌కాశ్ ఆర్థిక వ్య‌వ‌హారాల‌పై ఈడీ విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు వైసిపి రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి రాసిన లెటర్ ఇప్పుడు మీడియా తో పాటు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఫెమా – ఆర్బీఐ రెగ్యులేషన్ – మనీ లాండరింగ్ లతో పాటు ఇన్ కంటాక్స్ ఎగ్గొట్టడం ద్వారా రిమాండ్ లో వున్న రవిప్రకాష్ అక్రమాస్తులు కూడగట్టాడంటూ విజయ సాయి రెడ్డి పేల్చిన బాంబు పై ఇప్పుడు ఆధారాలు వేగంగా సేకరిస్తున్నారు.

గ‌తంలో జ‌గ‌న్ కేసులో శంక‌ర్ రావు రాసిన లేఖ ద్వారా నేరుగా సీబీఐ తెర‌మీద‌కు వ‌చ్చిన తర‌హాలోనే ఇప్పుడు విజ‌య‌సాయిరెడ్డి లేఖ కార‌ణంగా ర‌వి ప్ర‌కాశ్ కేసులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల జోక్యం అనివార్యంగా క‌నిపిస్తోంద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. అదే జ‌రిగితే ర‌వి ప్ర‌కాశ్ మ‌రికొన్నాళ్లు..ఇంకా చెప్పాలంటే మ‌రికొన్ని నెల‌ల పాటు జైలులో గ‌డ‌పాల్సిన ప‌రిస్థితి త‌ప్ప‌దు. అయితే గ‌తంలో జైలు జీవితం గ‌డిపిన జ‌గ‌న్, రేవంత్ రెడ్డి వంటి వారు ఇప్పుడు ఆయా రాష్ట్రాల రాజ‌కీయాల్లో కీల‌క నేత‌లుగా మారిన త‌రుణంలో జైలు నుంచి వ‌చ్చిన త‌ర్వాత ర‌వి ప్ర‌కాశ్ భ‌విత‌వ్యం ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here