జ‌గ‌న్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న బీజేపీ!

0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. బీజేపీ త‌న మార్క్ రాజ‌కీయాల‌కు సిద్ధం అవుతోంది. ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల‌లో ప్ర‌యోగించిన అస్త్రాన్నే ఆంద్ర‌ప్ర‌దేశ్ కేంద్రంగా సంధిస్తోంది. మ‌తోన్మాద రాజ‌కీయాల‌తో విస్త‌రించాల‌ని ఆశిస్తున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. వ‌రుస‌గా ముఖ్య‌మంత్రిని టార్గెట్ ని చేసుకుని బీజేపీ, సంఘీయులు చేస్తున్న ప్ర‌చారం దానికి ఉదాహ‌ర‌ణ‌గా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ వ్య‌క్తిగ‌తంగా క్రైస్త‌వ మ‌త‌స్తుడ‌నే విష‌యాన్ని ఆధారంగా చేసుకుని హిందూ వ్య‌తిరేకి ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

ఇప్ప‌టికే డ‌ల్లాస్ స‌భ‌లో జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న విష‌యంలో బీజేపీ నేత‌లు చేసిన ప్ర‌చారంలో వాస్త‌వం లేక‌పోయినా జ‌నాల‌ను కొంద‌రినైనా న‌మ్మించ‌వ‌చ్చ‌నే య‌త్నానికి దిగింది. స్టేడియంలో నిబంధ‌న‌ల ప్ర‌కారం మంట వెలిగించే అవ‌కాశం లేని కార‌ణంగా జ‌గ‌న్ జ్యోతిప్ర‌జ్వ‌ల‌న ఆగిపోతే దానిని మ‌త విశ్వాసాల‌కు ముడిపెట్టి బీజేపీ ప్ర‌చారం సాగించింది. అదే స‌మ‌యంలో శ్రీశైలం లో షాపుల విష‌యంలోనూ బీజేపీ, అనుచ‌ర సంఘాలు క‌లిసి పెద్ద రాధ్దాంతం చేశాయి. మ‌త ఉద్ద‌ర‌ణ పేరుతో మ‌తోన్మాదం మాటున తాము బ‌ల‌ప‌డాల‌నే త‌ప‌న ఎక్కువ‌గా ఉన్న‌ట్టు చాటుకున్నారు.

అన్నింటికీ మించి తిరుమ‌ల‌లో అన్య‌మ‌త ప్ర‌చారం సాగుతోందంటూ తాజాగా మ‌రో ప్రచారం ప్రారంభించారు. ముఖ్యంగా జెరుస‌లేం యాత్ర గురించి తిరుమ‌ల బ‌స్సుల్లో యాత్రికుల‌కు ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆర్టీసీ బ‌స్సు టికెట్ల‌ను ముందుకుతెస్తోంది. ఇదంతా జ‌గ‌న్ త‌న చేయిస్తున్నార‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డేలా శ్ర‌మిస్తోంది. త‌ద్వారా హిందూవ్య‌తిరేకి ముద్ర ప‌డితే అది మ‌తాధారంగా మెజార్టీ మ‌త‌స్తులు త‌మ‌వైపు మ‌ళ్లేందుకు దోహ‌దం చేస్తుంద‌నే అంచ‌నాలో బీజేపీ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. త‌ద్వారా మ‌తాల ప్రాతిప‌దిక‌న మ‌నుషుల‌ను విడ‌గొట్టి అయినా త‌మ మ‌నుగ‌డ ముఖ్య‌మ‌నుకునే త‌మ రాజ‌కీయాల‌కు అనుగుణంగా సాగుతోంది.

వైసీపీ నేత‌లు కూడా సోష‌ల్ మీడియాలో స‌న్నాయినొక్కులు త‌ప్ప బీజేపీని నేరుగా ఢీకొట్టగ‌లిగే అవ‌కాశం లేదు. హ‌స్తిన‌లో ఎలా ఉన్నా ఆంద్రాలో అడ్డుకోక‌పోతే త‌మ ఉనికికే ముప్పు త‌ప్ప‌ద‌నే ఆందోళ‌న ఉన్న‌ప్ప‌టికీ ఎటూ అడుగులు వేయ‌లేని స్థితిలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో మ‌త ప్రాతిప‌దిక‌న రాజ‌కీయాలు సాగిస్తున్న వారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. త‌ద్వారా ఏపీలో కులం ఆధారంగా సాగిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను మ‌తాల‌కు అనుగుణంగా మార్చేలనే బీజేపీ వ్యూహాల‌కు ప‌దును పెట్టేందుకు ఆస్కారం ఏర్ప‌డుతోంది. అందుకు టీడీపీ నేత‌లు కూడా స‌హ‌కరిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. జ‌గ‌న్ మీద వ్య‌తిరేక‌త‌తో బీజేపీ మార్క్ రాజ‌కీయాల‌కు ప్ర‌తిప‌క్షం కూడా తోడ్ప‌డుతున్న త‌రుణంలో క‌మ‌లం మ‌రింత దూకుడుగా వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దాంతో జ‌గ‌న్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంద‌నే అంచ‌నాలు బల‌ప‌డుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here