జ‌గ‌న్ ని ముంచ‌బోతున్న ఆమంచి!

0

ఆమంచి కృష్ణ‌మోహ‌న్. ఏపీ రాజ‌కీయాల్లో ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌కాశం జిల్లా చీరాల నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన ఆయ‌న ప్ర‌స్తుతం ఓట‌మి త‌ర్వాత కూడా పాల‌న‌లో త‌ల‌దూరుస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. పైగా త‌న‌కు గిట్ట‌ని వారి ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తార‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే తాజాగా చీరాల‌లో నాగార్జున రెడ్డి అనే విలేక‌రిపై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం వివాదాస్ప‌దంగా మారింది. అందులో ఆమంచి అనుచ‌రులు, బంధువులు కూడా నిందితులుగా ఉండ‌డంతో వైసీపీ నేత‌లు త‌మ పార్టీకి సంబంధం లేద‌ని ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది.

ఇప్ప‌టికే ఆమంచి కార‌ణంగా రెండు పార్టీలు మునిగిపోయాయ‌ని చీరాల‌లో కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి గెలిచిన త‌ర్వాత ఆపార్టీకి ఏపీలో పుట్ట‌గ‌తులు లేకుండా పోయాయ‌ని చెబుతున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న సొంతంగా విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ టీడీపీలో కొన‌సాగారు. చివ‌ర‌కు టీడీపీ కూడా ఇప్పుడు ఢోలాయ‌మానంలో ప‌డింది. త‌ర్వాత ఇప్పుడు మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు ఆమంచి వైసీపీలో చేరిన‌ప్ప‌టికీ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా ఆయ‌న మాత్రం ఘోర ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్నారు.

ఓట‌మి త‌ర్వాత కూడా తీరు మార్చుకోకుండా చీరాల‌లో పెత్త‌నం కోసం ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నాలు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశాల‌వుతున్నాయి. ఇప్ప‌టికే రెండు పార్టీలు మునిగిన నేప‌థ్యంలో వైసీపీ కూడా ఈ తీరుని అడ్డుకోలేక‌పోతే మునిగిపోతుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఆమంచిని క‌ట్ట‌డి చేయ‌డం జ‌గ‌న్ కి అత్య‌వ‌స‌రం అని సూచిస్తున్నారు. ఇదే రీతిలో వ‌దిలేస్తే మాత్రం పార్టీకి, ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు త‌ప్ప‌వ‌ని సొంత పార్టీ నేత‌లే వ్యాఖ్యానించే ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి జ‌గ‌న్ అడ్డుక‌ట్ట వేస్తారా లేక ఇలాంటి వ్య‌వ‌హారాల‌తో అభాసుపాల‌వుతారా అన్న‌ది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here