జ‌గ‌న్ స‌ర్కారు కంట్లో న‌లుసులా మారిన ఇసుక‌

0

ఇసుక పాల‌సీ ఇప్ప‌టికే అనేక ప్ర‌భుత్వాల‌కు పెద్ద త‌ల‌నొప్పిని సృష్టించింది. చంద్రబాబు ప్ర‌భుత్వం ప్ర‌జావ్య‌తిరేక‌త‌కు ఇసుక కూడా ఓ కార‌ణం. మాఫియాల వ్య‌వ‌హారంతో మామూలు జ‌నం ప్ర‌భుత్వం మీద ఓటు రూపంలో మండిప‌డ్డారు. దానిని గ‌మ‌నించిన జ‌గ‌న్ అందుకు అనుగుణంగా ప‌లు మార్పులు చేశారు. ఇసుక అక్ర‌మాల‌ను అడ్డుక‌ట్ట వేయాల‌ని త‌లంచారు.

కానీ తీరా చూస్తే ఆచ‌ర‌ణ అందుకు భిన్నంగా ఉంది. జ‌గ‌న్ మాట‌ల‌కు ఆమ‌డదూరంలో వ్య‌వ‌హారం క‌నిపిస్తోంది. ఇసుక మాఫియా మ‌ళ్లీ చెల‌రేగిపోతోంది. ఏపీఎండీసీలోని కొంద‌రు పెద్ద‌ల అండ‌తో మ‌ళ్లీ మాఫియా విరుచుకుప‌డుతున్న వేళ సామాన్యుడికి ఇసుక కొర‌త పెద్ద ఇబ్బందిని తీసుకొస్తోంది. దాంతో కొంద‌రు భ‌వ‌న నిర్మాణ కార్మికులు మృత్యువాత ప‌డుతున్నారు.

విప‌క్షాల‌కు ఇప్పుడు ఇసుక పెద్ద ఆయుధం అయిపోయింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది. ఇసుక కొర‌త‌ను అంగీక‌రిస్తూనే వ‌ర‌ద‌లు కార‌ణం అంటోంది. కానీ వాస్త‌వానికి వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇసుక కొర‌త ఏర్ప‌డింద‌నే విష‌యాన్ని అనేక మంది సాధార‌ణ ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డం లేదు. భ‌వ‌న నిర్మాణ కార్మికులు ప్ర‌భుత్వ వాద‌న‌ను పూర్తిగా తోసిపుచ్చుతున్నారు.

దాంతో జ‌న‌సేన లాంగ్ మార్చ్, టీడీపీ నిర‌స‌న‌లు, ఇత‌ర పార్టీలు, సంఘాల ఆందోళ‌న‌ల‌తో ప్ర‌భుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కంట్లో న‌లుసులా మారి క‌ల‌త చెంద‌డానికి కార‌ణం అవుతోంది. ప‌లు ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి, ఉచితంగా పెద్ద మొత్తాల్లో పంపిణీ చేస్తున్న‌ప్పుడు రావాల్సిన మైలేజీ ద‌క్క‌క‌పోగా ఇసుక కార‌ణంగా నెగిటివ్ ప్ర‌చారం ఊపందుకోవ‌డంతో ఊపిరిస‌ల‌ప‌డం లేదు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని చేసిన ప్ర‌య‌త్నం బెడిసికొట్టి మ‌రింత తీవ్రం కావ‌డంతో వారోత్స‌వాల‌కు పిలుపునిచ్చినా ఎక్క‌డా అలాంటి ఊసే వినిపించ‌డం లేదు. ఈప‌రిణామాలు జ‌గ‌న్ స‌ర్కారుకి రుచించే అవ‌కాశం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here