జ‌న‌సేనాని దూకుడు కొన‌సాగిస్తారా?

0

ఏపీ రాజ‌కీయాల్లో జ‌న‌సేన ప్ర‌స్థానం ఎత్తుప‌ల్లాల మ‌ధ్య సాగుతోంది. పూర్తిస్థాయి పొలిటిక‌ల్ ఇమేజ్ సంపాదించ‌డంలో నేటికీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌ల‌ప్ర‌దం కాలేక‌పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఈసారి పూర్తిస్థాయి పొలిటీషియ‌న్ గా ప్ర‌జ‌ల ముందు నిల‌వాల‌ని ఆయ‌న నిశ్చితాభిప్రాయంగా క‌నిపిస్తోంది. తాజాగా అధికార పార్టీ, ప్ర‌భుత్వం మీద ప‌వ‌న్ చేసిన కామెంట్స్ అందుకు త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి. రాజ‌కీయంగా ఘాటు వ్యాఖ్య‌ల‌తో ప్ర‌త్య‌ర్థి శిబిరంలో చ‌ర్చ‌నీయాంశంగా మారేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి భ‌విత‌వ్యం విష‌యంలో జ‌గ‌న్ కి ఎవ‌రు పోటీ అనేది నేటికీ చ‌ర్చ‌నీయాంశంగా ఉంది. ముఖ్యంగా చంద్ర‌బాబు వ‌య‌సు మీరుతుండ‌డంతో ఆయ‌న ప్ర‌త్యామ్నాయం కాగ‌లరా లేదా అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా ఉంది. అదే స‌మ‌యంలో జ‌న‌సేనాని సినిమా ఛ‌ట్రం నుంచి బ‌య‌ట‌ప‌డ‌క‌పోతే జ‌గన్ నాయ‌క‌త్వానికి తిరుగుండ‌ద‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన త‌న రాజ‌కీయ వ్యూహాలు స‌వ‌రించుకుని, ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యామ్నాయం స్థాయికి ఎదిగేందుకు తీవ్రంగా శ్ర‌మింగాచాల్సి ఉంటుంది.

తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌య‌త్నాలు అందుకు అనుగుణంనే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల వ‌రుస‌గా రాజ‌కీయా కార్య‌క‌లాపాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. రాబోయే ఐదేళ్లు కూడా అదే దూకుడు కొన‌సాగించాల‌ని ఆశిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. 100రోజుల జ‌గ‌న్ పాల‌న‌పై నివేదిక దానికి నాంది ప‌లికింది. ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇదే రీతిలో ప్ర‌త్య‌ర్థి పార్టీపై దాడిని కొన‌సాగించ‌డం రాజ‌కీయంగా అత్య‌వ‌స‌రం అని చెప్ప‌వ‌చ్చు. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల నాడికి అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాలి. జ‌గ‌న్ పాల‌న మీద ప్ర‌జ‌ల్లో పూర్తిగా విశ్వాసం తొల‌గిపోయే ప్ర‌స్తుతానికి లేదు. అదే స‌మ‌యంలో సంక్షేమం విష‌యంలో ప్ర‌భుత్వం దృష్టి సారిస్తోంది. ఈ త‌రుణంలో విమ‌ర్శ‌ల తాకిడి అదే రీతిలో ఉండాలి. లేకుంటే ప్ర‌జ‌లు ఆద‌రించే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. రాజ‌కీయంగా వ్యూహాత్మంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతే అస‌లుకే ఎస‌రు తెస్తుంద‌న్న‌ది ప‌వ‌న్ గ్ర‌హించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here