జ‌ర్న‌లిస్టుల‌కు జ‌గ‌న్ తొలి ఝ‌ల‌క్..!

0

ముఖ్య‌మంత్రి హోదాలో సీఎం జ‌గ‌న్ చేసిన మూడో సంత‌కం కూడా ఆచ‌ర‌ణ రూపం దాల్చ‌లేదు. రెండో సంత‌కం అమ‌లుకోసం ఆశా వర్క‌ర్లు పెద్ద పోరాట‌మే చేసి సాధించుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ జ‌ర్న‌లిస్టుల‌కు అలాంటి ఐక్య‌త‌, సంఘాల‌లో దృఢ‌త్వం లేక‌పోవ‌డంతో తొలి సంత‌కంతోనే జ‌ర్న‌లిస్టుల‌కు తొలి ఝ‌ల‌క్ త‌గులుతోంది.

గ‌త ప్ర‌భుత్వం అమ‌లులోకి తీసుకొచ్చిన జ‌ర్న‌లిస్టుల హెల్త్ స్కీమ్ ఇప్పుడు నిలిచిపోయింది. ఏటా 1250 రూ.ల చొప్పున పాల‌సీదారుల పేరుతో జ‌ర్న‌లిస్టు నుంచి వ‌సూలు చేస్తున్న ప్ర‌భుత్వం సేవ‌లు మాత్రం స‌క్ర‌మంగా అందించ‌డం లేద‌న్న‌ది లోకానికి ఎరుకే. చాలాకాలంగా ఈ స‌మ‌స్య ఉంది. అయితే దానిని ప‌రిష్క‌రించి, ఇన్సూరెన్స్ ను 5 ల‌క్ష‌ల నుంచి 10ల‌క్ష‌ల‌కు పెంచుతున్న‌ట్టు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఆయ‌న సెక్ర‌టేరియేట్ లో అడుగుపెట్టిన వెంట‌నే పెట్టిన సంత‌కాల్లో మూడో సంత‌కంగా దానిని పూర్తి చేశారు.

ప్ర‌భుత్వం శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకున్న‌ప్ప‌టికీ జ‌ర్న‌లిస్టుల హెల్త్ పాల‌సీ విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు. గ‌త నెలాఖ‌రు వ‌ర‌కూ పాత‌కార్డులు రెన్యువ‌ల్స్ చేయ‌డంతో కొంత ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. కానీ ఈనెల‌లో మాత్రం ప‌లు చోట్ల పాత్రికేయులు ఆసుప‌త్రుల ముందు నానార‌కాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్య‌వ‌స‌రాల్లో మ‌రింత అవ‌స్థ‌లు ఎదుర్కొంటున్నారు. ఇక కొంద‌రు విలేక‌ర్ల‌కు పాల‌సీ సొమ్ము చెల్లించి కార్డు రాక‌పోవ‌డం, పైగా ఆన్ లైన్ లో రెన్యువ‌ల్ అయిన‌ట్టు చూపించ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉన్నాయి. వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించాల్సిన ఐ అండ్ పీఆర్ క‌మిష‌న‌రేట్ లో ఉలుకూ ప‌లుకూ లేదు. ఇక ఆరోగ్య‌శ్రీ కార్డుతో ముడిపెట్టి చేసిన ప్ర‌య‌త్నం ప‌ట్ల అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్న త‌రుణంలో వ్య‌వ‌హారం సందిగ్ధంలో ప‌డిన‌ట్టుగా క‌నిపిస్తోంది. అయినా స‌మాచార శాఖ అధికారుల‌కు గానీ చీమ‌కుట్టిన‌ట్టు కూడా లేదు.

ఇప్ప‌టికే జాతీయ స్థాయి జ‌ర్న‌లిస్టు సంఘాల నేత‌లుగా ప‌నిచేసిన వారు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీల‌క బాధ్య‌తల్లో ఉన్నారు. పాత్రికేయుల కోసం ఎంతో పాటుప‌డిన‌ట్టు చెప్పుకుంటున్న నేత‌లే ఇప్పుడు సాధార‌ణ జ‌ర్న‌లిస్టుల సంక్షేమ విష‌యంలో ప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం, పైగా సీఎం తొలి సంత‌కాల‌కే విలువ లేద‌న్న‌ట్టుగా మార్చేయ‌డంతో చాలామంది జ‌ర్న‌లిస్టులు స‌త‌మ‌తం అవుతున్నారు. మ‌రి ఏలిన వారికి ఎప్ప‌టికి ద‌య‌క‌లిగేనో..ఎన్న‌టికి స‌మ‌స్య తీరేనో అన్న‌దానిని బ‌ట్టి పాత్రికేయుల‌కు ప్రాణ‌ర‌క్ష‌ణ ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here