జ‌ర్న‌లిస్ట్ సంఘ ముసుగులో దందా: జ‌గ‌న్ ఏం చేస్తారో?

0

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో జ‌ర్న‌లిస్ట్ సంఘాల పేరుతో నాయ‌కులు సాగిస్తున్న వ్య‌వ‌హారాలు నానా ర‌చ్చ‌కు దారితీస్తున్నాయి. తాజాగా ఓ ప్ర‌ధాన సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాగించిన దందా వెలుగులోకి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌యిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. సొంత ప‌త్రిక‌ల‌కు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల పేరుతో పెద్ద మొత్తంలో మ‌ళ్లించిన వైనం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. కొంద‌రు ఐ అండ్ పీఆర్ అధికారుల భాగ‌స్వామ్యంతో గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో సాగించిన ఈ భాగోతం పై విచార‌ణ సాగిస్తే అనేక విష‌యాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పాత్రికేయులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

చంద్ర‌బాబు సీఎంగా ఉన్న కాలంలో ఐ అండ్ పీఆర్ లో జేడీ స్థాయి అధికారి ఒక‌రు అన్నీ తానై అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఆ క్ర‌మంలోనే అన్నింటిక‌న్నా త‌మ‌దే పెద్ద సంఘం అని చెప్పుకునే వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల నాయ‌కుడు ఒక‌రు స‌ద‌రు అధికారితో క‌లిసి చాలా పెద్ద మొత్తంలోనే చ‌క్క‌బెట్టేశార‌ని స‌మాచారం. ప్ర‌భుత్వ ఖ‌జానాకి క‌న్నం వేస్తూ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా సాగించిన వ్య‌వ‌హారంలో స‌ద‌రు పాత్రికేయ నేత భార్య పేరుతో భారీగా ప్ర‌క‌ట‌న‌లు కాజేసిన‌ట్టుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వీటిపై విచార‌ణ సాగించాల‌ని కొంద‌రు కోరుతున్నారు.

ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ప్ర‌తికా ప్ర‌క‌ట‌న‌ల విష‌యంలో పిసినారిత‌నం ప్ర‌ద‌ర్శిస్తోంది. కానీ గ‌తంలో అలా కాదు. అడిగిన వాళ్ల‌కు కాద‌నుకుండా ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. ఆక్ర‌మంలోనే ఉందో లేదో కూడా తెలియ‌ని ఓ పత్రిక‌ను అడ్డం పెట్టుకుని సంఘం నాయ‌కుడు, అధికారులు క‌లిసి భారీగా నిధులు ప‌క్క‌దారి ప‌ట్టించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నాలు వేస్తున్న త‌రుణంలో అస‌లు వాస్త‌వం ఏమేర‌కు బ‌య‌ట‌కు వ‌స్తుంద‌న్ని ఆస‌క్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here