టీడీపీ ఖాళీ అవుతుందా..చేస్తున్నారా..?

0

సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత టీడీపీకి తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. పార్టీ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుందా అన్న సందేహం వ‌స్తోంది. ఇప్ప‌టికే తెలంగాణాలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఏపీలో కూడా అదే ప‌రిస్థితి ఎదుర‌వుతుందా అన్న సందేహం వ‌స్తోంది. ఇప్ప‌టికే కీల‌క నేత‌లు ఖాళీ చేసిపోగా, మ‌రికొంద‌రు అదే జాబితాలో ఉన్నారు.

సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్ వంటి చంద్ర‌బాబు అతి స‌న్నిహితులు కూడా టీడీపీని వీడిన నేప‌థ్యంలో అంతా చంద్ర‌బాబు వ్యూహం అనే అనుమానాలు క‌లిగాయి. కేసులు, ఇత‌ర స‌మ‌స్య‌ల నుంచి కాపాడుకునేందుకు ఇలాంటి వ్యూహాలు ముందుకు వ‌చ్చి ఉంటాయ‌ని ప‌లువురు భావించారు. తాజాగా సాధినేని యామినీ, దివ్య‌వాణి, వారి త‌ర్వాత మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి వంటి వారు కూడా క‌మ‌లం గూటిలోకి క్యూ క‌డుతుండ‌డం ఈ అనుమానాలు బ‌ల‌ప‌రుస్తోంది.

తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి రానురాను కుచించుకుపోతున్న ధోర‌ణితో మ‌రింత మంది నేత‌లు కూడా దూర‌మ‌య్యే అవ‌కాశం స్ప‌ష్టంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ మార్పుల‌న్నీ టీడీపీని ఖాళీ చేస్తాయా..లేక ఆపార్టీని ఖాళీ చేసి జాతీయ స్థాయిలో సంపూర్ణ ఆధిక్యంలో ఉన్న బీజేపీ ద్వారా ఏపీలో మ‌ళ్లీ చ‌క్రం తిప్పాల‌నే ఓ సెక్ష‌న్ ప‌థ‌క‌మా అన్న‌ది త్వ‌ర‌లో తేలుతుంది.

చంద్ర‌బాబు తాజాగా ఎన్టీఆర్ తో ఏకాంతంగా మంత‌నాలు జ‌రిపారు. అదే స‌మ‌యంలో ఆయ‌న స‌న్నిహిత మిత్రులు సైతం బీజేపీ దారిలో ఉన్నారు. ఇవ‌న్నీ క‌లిసి తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో మ‌రిన్ని స‌మ‌స్య‌ల‌కు కార‌ణం కావ‌డ‌మే గాక‌, మ‌నుగ‌డ‌ను ప్ర‌శ్నార్థ‌కంగా త‌యారు చేసే ద‌శ‌కు దారితీస్తాయ‌నే అంచ‌నాలు మొద‌ల‌వుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here