ట్రిపుల్ మ‌ర్డ‌ర్: ఆర్ఎస్ఎస్ ప్ర‌చారం

0

బెంగాల్ లోని ముర్షీదాబాద్ ప్రాంతంలో ఓ కుటుంబం హ‌త్య‌కు గుర‌య్యింది. ముగ్గ‌రు స‌భ్యుల‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేశారు. మృతి చెందిన వారిలో దీప‌క్ పాల్ అనే ఉపాధ్యాయుడు, గ‌ర్భిణీగా ఉన్న అత‌ని భార్య‌, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ ట్రిపుల్ మ‌ర్డ‌ర్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది.

ఈ హ‌త్య‌కు కార‌ణం తృణ‌మూల్ అంటూ ఆర్ఎస్ఎస్ ఆరోపిస్తోంది. ఉపాధ్యాయుడిగా ఉన్న దీప‌క్ పాల్ ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌గా చెబుతోంది. అయితే స్థానిక బీజేపీ నేత‌లు మాత్రం ఈ హ‌త్య‌ల‌కు రాజ‌కీయాలు కార‌ణం కాద‌ని భావిస్తున్న‌ట్టు మీడియాకు వెల్ల‌డించడం విశేషం.

దీప‌క్ పాల్ రెండేళ్ల క్రితం త‌మ‌ప్రాంతానికి వ‌చ్చాడ‌ని, మంగ‌ళ‌వారం నాడు మార్కెట్ కి వెళ్లి వ‌చ్చిన గంట త‌ర్వాత హ‌త్య‌కు గుర‌యిన‌ట్టు స్థానికులు వెల్ల‌డించారు. మృతులు ముగ్గురు అనుమాన‌స్ప‌ద మందు సేవించి ఉన్న‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. పైగా మృతులు ముగ్గురూ ఒకే ఇంట్లో వేరు వేరు ప్రాంతాల్లో ప‌డి ఉన్నారు. దాంతో ఇవి హ‌త్య‌లా, లేక ఇత‌ర కార‌ణాలతో జ‌రిగిన మ‌ర‌ణాలా అన్న‌ది తేలలేదు. దాంతో పోలీసులు మాత్రం అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

ఓవైపు విచార‌ణ సాగుతుండ‌గానే ఈ కేసు చుట్టూ ఆర్ఎస్ఎస్ ప్ర‌చారం మొద‌ల‌య్యింది. ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త కాబ‌ట్టి దీప‌క్ ని, ఆయ‌న కుటుంబాన్ని హ‌త్య చేశార‌ని ఆరోపిస్తోంది. ఈ హ‌త్య వెనుక తృణ‌మూల్ ఉంద‌ని ఆరోపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here