తూర్పున‌ బాబుకి ఎదురుదెబ్బ‌లు

0

ఏపీలో పార్టీని పున‌రుత్తేజం దిశగా న‌డిపేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తుండ‌గా పార్టీ నేత‌లు అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. అధినేత ఆలోచ‌న‌కు భిన్నంగా పార్టీ శ్రేణులున్న‌ట్టు క‌నిపిస్తోంది. తూర్పు గోదావ‌రి జిల్లాతో త‌న జిల్లాల వారీ ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీకారం చుట్టిన చంద్ర‌బాబుకి ఆదిలోనే హంస‌పాదు అన్న‌ట్టుగా మారింది.

తూర్పుగోదావరి జిల్లా ముఖ్య నాయకులు ఝలక్ ఇచ్చారు. జిల్లా విస్తృతస్థాయి సమీక్ష సమావేశానికి ముఖ్యనేతలు గైర్హాజరయ్యారు. కాకికాడ, రాజమండ్రి లోక్సభ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్, మాగంటి రూప ఈరోజు సమావేశానికి హాజరుకాలేదు. రామచంద్రపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీచేసిన తోట త్రిమూర్తులు కూడా ముఖం చాటేశారు. వీరు ముగ్గురు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

తోట త్రిమూర్తులు టీడీపీని వీడతారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్య నేతలు సమావేశానికి రాకపోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. వారితో పాటుగా కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడు నున్న దొరబాబు, జిల్లా మహిళ అధ్యక్షురాలు అడ్డూరి లక్ష్మీ శ్రీనివాస్, తొమ్మిది మంది కార్పొరేటర్లు కూడా స‌మావేశానికి ఢుమ్మా కొట్టేశారు.

దాంతో టీడీపీ అధినేత‌కు ఈ ప‌రిణామాలు మింగుడుప‌డిన‌ట్టుగా క‌నిపించ‌డం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here