తెరపైకి ఓటుకి నోటు

0

తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో కీలక మార్పులకు కారణమైన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరమీదకు వచ్చేలా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ భవితవ్యానికి పెద్ద ఆటంకంగా మారిన ఈ కేసు ఆపార్టీ అథినేతను వెంటాడుతున్నట్టే కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కొంత పట్టువిడుపులతో వ్యవహరించడం వల్లే ఈ కేసు కొలిక్కి రావడం లేదన్నది పలువురి అభిప్రాయం.

ఈ నేపథ్యంలోనే ఓటుకు నోటు కేసు, నయీం కేసులను సిట్టింగ్‌ జడ్జిచే ప్రత్యేక విచారణ జరిపించి వెంటనే దోషులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీకి వినతిపత్రం సమర్పించారు. పలు సంఘాల ప్రతినిధులు హోం మంత్రిని కలిసి ఈ విషయం ప్రస్తావించారు.

ఈ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డిల మధ్య అధికారికంగా ప్రభుత్వం మీడియాలో ప్రాథమిక సాక్ష్యాధారాలు వెల్లడించి 5 సంవత్సరాలు దాటినా పురోగతి లేదని వారు వాపోయారు. అదే విధంగా నయీముద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ అయిన తర్వాత వేలాది కోట్ల ఆస్తుల అంశంపై నాలుగేళ్లుగా ఎలాంటి పరిష్కార చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రెండు కేసులను సిట్టింగ్‌ జడ్జిచే విచారణ జరిపించాలని వారు తెలంగాణా ప్రభుత్వాన్ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here