తెర‌కెక్కుతున్న పీవీ సింధు

0

ఇప్ప‌టికే ప‌లువురు స్పోర్ట్ స్టార్స్ జీవితాలు తెర‌కెక్కి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో గోల్డెన్ గ‌ర్ల్ పీవీ సింధు చేరుతోంది. ఇటీవ‌లే వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ లో గోల్డ్ ప‌తాకం గెలుచుకుని చ‌రిత్ర సృష్టించిన పీవీ సింధుని ప‌లువురు వ‌రుస‌గా అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు.

ఆ క్ర‌మంలోనే పీవీ సింధు జీవితం ఆధారంగా ఓ సినిమాను రూపొందించేందుకు బాలీవుడ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సింధు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పాత్రలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అక్షయ్‌ కుమార్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని ఇటీవల గోపీచంద్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అంతేకాదు పీవీ సింధు బయోపిక్‌లో తన పాత్రలో అక్షయ్‌ నటిస్తే బాగుంటుందని చెప్పడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. అయితే, బయోపిక్‌పై తనకు పూర్తి సమాచారం లేదని గోపీచంద్‌ పేర్కొన్నారు.

పీవీ సింధు పాత్ర ఎవ‌రు పోషించ‌బోతున్నార‌నే విష‌యం ఆస‌క్తిగా మారుతోంది. అన్ని భాష‌ల్లోనూ విడుద‌ల చేసేలా సినిమా రూపొందించ‌డానికి స‌ర్వం సిద్ధం అయిన‌ట్టు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here