దంచికొట్టిన డేవిడ్ వార్న‌ర్..!

0

ఆస్ట్రేలియ‌న్ స్టార్ బ్యాట్స్ మెన్లు చెల‌రేగిపోయారు. నిషేధం త‌ర్వాత తొలిసారిగా సొంత గ‌డ్డ‌పై ఆడుతున్న డేవిడ్ వార్న‌ర్ రెచ్చిపోయాడు. పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌కు ప‌గ‌లే చుక్క‌లు చూపించాడు. డే అండ్ నైట్ టెస్టు క్రికెట్ లో కొత్త చ‌రిత్ర సృష్టించాడు.

యాషెస్‌ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన వార్నర్‌.. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో భారీ సెంచరీతో మెరిశాడు. అదే జోరును రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సైతం కొనసాగిస్తున్నాడు. 394 బంతుల్లో 37 ఫోర్లతో వార్నర్‌ ట్రిపుల్‌ సెంచరీ నమోదు చేశాడు. వార్నర్‌కు టెస్టుల్లో ఇదే తొలి ట్రిపుల్‌ సెంచరీ కాగా, ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ నిలిచాడు.

ఇక పాకిస్తాన్‌పై ట్రిపుల్‌ సెంచరీ సాధించిన రెండో ఆసీస్‌ ఆటగాడిగా గుర్తింపు సాధించిన వార్నర్‌.. ఓపెనర్‌గా నాల్గో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా చూస్తే టెస్టు ఫార్మాట్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన 16వ ఆటగాడు వార్నర్‌. డే అండ్‌ నైట్‌ టెస్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన నయా రికార్డును వార్నర్‌ తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు వరకూ పాకిస్తాన్‌ కెప్టెన్‌ అజహర్‌ అలీ(302 నాటౌట్‌) పేరిట ఈ రికార్డు ఉండగా దాన్ని వార్నర్‌ బ్రేక్‌ చేశాడు.వార్నర్‌ 303 పరుగులకు చేరిన తర్వాత అజహర్‌ అలీ రికార్డు బ్రేక్‌ అయ్యింది.డే అండ్‌ నైట్‌ టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల సాధించిన రికార్డును కూడా వార్నర్‌ సాధించాడు. డే అండ్‌ నైట్‌ టెస్టుల్లో అజహర్‌ అలీ మొత్తంగా 456 పరుగులు చేస్తే దాన్ని వార్నర్‌ బ్రేక్‌ చేశాడు.

ఇక ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును కూడా వార్నర్‌ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డును బ్రేక్‌ చేశాడు. గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన పుణె టెస్టులో కోహ్లి అజేయంగా 254 వ్యక్తిగత పరుగులు సాధించగా, దాన్ని వార్నర్‌ సవరించాడు.

ఇక 36ర‌న్స్ చేసిన స్టీవ్ స్మిత్ టెస్టుల్లో వేగంగా 7వేల ప‌రుగులు పూర్తి చేసిన వ‌ర్త‌మాన ఆట‌గాడిగా నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here