నాగార్జునకి ‘బిగ్’ షాక్!

0

గతంతో పోలిస్తే బిగ్ బాస్ 3 సీజన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా హౌస్ లో ప్రవేశించిన వారి జాబితా నుంచి హోస్ట్ వరకూ అన్నింటా బిగ్ బాస్ కి ఆశించిన ఫలితాలు రావడం లేదని చెబుతున్నారు. స్టార్ మా కూడా ఈ పరిస్థితిని , ముఖ్యంగా మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ఆదరణ తగ్గుతున్న తీరుని గమనిస్తోందని చెబుతున్నారు.

ఈలోగా స్టార్ హోస్ట్ అక్కినేని నాగార్జున అనారోగ్యం, ఆ తర్వాత ఆయన కుటుంబంతో స్పెయిన్ వెళ్లడంతో హోస్ట్ మార్పు అనివార్యంగా మారింది. అనూహ్యంగా నాగార్జున స్థానంలో రమ్యక్రుష్ణ ఎంట్రీ చాలామందిని ఆశ్చర్యపరిచింది. తొలిసారిగా బిగ్ బాస్ కార్యక్రమానికి ఫిమేల్ హోస్ట్ రావడం కూడా దానికో కారణం.

తాజాగా ఈ వారంతో రమ్యక్రుష్ణ ఎంట్రీ చాలామందిని తొలుత ఆశ్చర్యపరిచినా, కార్యక్రమం నడిపించిన తీరు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న స్పందనలను బట్టి నాగార్జున కంటే రమ్యక్రుష్ణ బెటర్ అనే అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో నాగార్జున స్థానంలో రమ్యక్రుష్ణ స్టాండ్ బై గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ చివరకు స్టాండ్ అయిపోతుందేమోననే అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో ఇది నాగార్జునకి షాకింగ్ న్యూస్ గానే చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here