నాగార్జునకు అనారోగ్యం, సమాచారం వెల్లడికి నిరాకరణ

0

బిగ్ బాస్ 3 హోస్ట్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ, మన్మథుడు 2 అంటూ అభిమానులను ఆకట్టుకున్న అక్కినేని నాగార్జున హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అధికారికంగా వెల్లడించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నట్టు చెబుతున్నారు. దాంతో టాలీవుడ్ వర్గాల్లో ఇదో హాట్ టాపిక్ అయ్యింది.

ఇటీవల మన్మథుడు 2 ప్రచార కార్యక్రమాల్లో కూడా నాగార్జున చేతికి బ్యాండ్ ఉంది. దాంతో పలు ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించడంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా ఈనెల 29న పుట్టిన రోజు జరుపుకోబోతున్న తమ అభిమాన హీరోని కలిసేందుకు అభిమాన సంఘాలు చేస్తున్న ప్రయత్నాలకు అనుమతి రాకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి.

ఆగస్ట్ 29తో ఆయన అరవై ఏళ్ల వయసులో అడుగుపెడుతున్నారు. ఈ సారి ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరపాలని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం చుట్టూ ఊహాగానాలు వస్తుండడంతో ఆసక్తిగా మారింది. అయితే ఈ ప్రచారాలను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. ఆయన జిమ్ లో ఎక్కువ సేపు ఎక్సర్ సైజ్ చేయడంతో కొంత అలసిపోయి ఉన్నారని మాత్రం చెబుతున్నారు. దాంతో అసలు ఏం జరుగుతుందనే విషయంలో స్పష్టత లేకపోవడంతో పలు రకాల గాసిప్స్ బలంగా వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here